Hopes of AP and Bihar special status are Shutterd : కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వ మనుగడ టీడీపీ, జేడీయూ పార్టీల మీద ఆధారపడి ఉంది. అదే సమయంలో ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చాలా కాలంగా ప్రత్యేకహోదా డిమాండ్ ఉంది. దీంతో కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన చేస్తుందని అనుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కమార్ అదే పనిగా ప్రత్యేకహోదా డిమాండ్ వినిపించారు. అయితే పార్లమెంట్ సమావేశాల తొలి రోజే కేంద్రం ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది.
బీహార్‌కు ప్రత్యేకహోదా అర్హత లేదన్న కేంద్రం
బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్‌సభలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ది మండలి-ఎన్‌డిసి ఐదు నిబంధనలు పెట్టిందని.. ఆ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చి పార్లమెంట్‌కు సమాధాన ఇచ్ిచంది. నిబంధనల ప్రకారం... గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించామని.. గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేశాయమన్నారు. 2012 మార్చి 30 నివేదిక ఇచ్చినట్లు . ఎన్‌డిసి నిబంధనల ప్రకారం బీహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని 2012లో అంతర్ మంత్రిత్వ శాఖల బృందం నివేదిక తేల్చి చెప్పిందన్న కేంద్రం తేల్చి చెప్పింది.
చంద్రబాబుకు భయం - విపక్ష హోదా అందుకే ఇవ్వట్లేదు - జగన్ కీలక వ్యాఖ్యలు
ఆ నిబంధనలే ఏపీకి వర్తిస్తాయి !
బీహార్‌కు మాత్రమే ప్రత్యేకహోదా లేదని కేంద్రం చెప్పింది. ఏపీ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. పార్లమెంట్ కు కేంద్రం సమాధానం ఇచ్చిన ప్రశ్న.. బీహార్ కు సంబంధించినదే. అందుకే బీహార్ గురించే చెప్పారు. జాతీయ అభివృద్ది మండలి-ఎన్‌డిసి ఐదు నిబంధనలు ఏపీకి కూడా వర్తిస్తాయి. బీహార్ ఏ అర్హతా ప్రమాణాలు సాధించలేదు..అలాగే ఏపీకి కూడా ఆ నిబంధనలు వర్తిస్తాయి. అంటే.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా లేదని కేంద్రం చెప్పినట్లే. రేపు ఎవరైనా పార్లమెంట్ లో అడిగితే కేంద్రం నుంచి ఇదే సమాధానం వచ్చే అవకాశం ఉంది.
బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు - జగన్ కు షర్మిల సూటి ప్రశ్న
ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే ఆలోచన
రెండు పార్టీలు ఎన్డీఏ కూటమికి అత్యంత కీలకం కాబట్టి.. రెండు రాష్ట్రాలు ఆర్థిక పరమైన సమస్యల్లో ఉన్నాయి కాబట్టి కేంద్రం మంచి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అధికంగా రుణసాయం చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులకు గ్రాంట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కలిపి ఓ ప్యాకేజీగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకహోదా అనేది.. సాధ్యం కాదని తెలిసినా కొన్ని రాజకీయ పార్టీలు...పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని.. బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.