Anantapur Youth Stuck in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక విమానాల ద్వారా రప్పిస్తోంది. ఇప్పటికే మూడు విమానాల ద్వారా 700కు పైగా భారతీయులను ఢిల్లీకి తీసుకొచ్చారు. అక్కడి వారి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను స్వస్థలాలకు వచ్చేలా ఏర్పాట్లు చేశాయి. ఏపీకి చెందిన ఓ విద్యార్థి ఉక్రెయిన్ నుంచి రాలేకపోయాడు. ఇంకా అక్కడే ఉన్నాడు. మరోవైపు అతడి ఇంట్లో శుభకార్యం ఉంది. తాను లేనని బాధపడవద్దని చెల్లెలికి, కుటుంబసభ్యులకు చెప్పడం స్థానికులను కదిలిస్తోంది.


శుభకార్యానికి రాలేకపోయిన యువకుడు  
‘చెల్లి నీ ఎంగేజ్ మెంట్ ఈవెంట్‌కు రాలేక పోతున్నాను. అయినా భయపడకు. నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. నేను త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాను’ అంటూ  ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన అనంతపురం జిల్లా యువకుడు హరీష్ తన తల్లిదండ్రులు, సోదరికి ధైర్యం చెప్పిన మాటలివి. హిందూపురం మండలం తూముకుంట పంచాయతీ పరిధిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన హరీష్ ఉక్రెయిన్లోని డొమెస్టిక్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించడంతో హరీష్ తన ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరు కాలేక పోవడం బాధాకరం. 


రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తన చెల్లి ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఆ మెడికల్ స్టూడెంట్ గ్రామానికి చేరుకోలేక పోయినా అతను తన తల్లి తండ్రులకు ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్పడం స్థానికులను సైతం ఆలోచింప చేస్తోంది. రష్యా బాంబు దాడులు చేస్తుండటంతో తన కుమారుడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని హరీష్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


తన కుమారుడ్ని ఎలాగైనా సరే సురక్షితంగా ఇండియాకు రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అతడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. విద్యార్థి హరీష్ తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.  ప్రస్తుతం తనతో పాటు నేపాల్ దేశానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్లు చెప్పాడు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపాడు. భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు ఎంబసీ ఏర్పాట్లు చేస్తోందని, తన గురించి ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పాడు. 


బాధ పడొద్దు..
చెల్లెలి నిశ్చితార్థానికి నేను రాలేకపోయానని మీరు బాధ పడవద్దు. పరిస్థితుల కారణంగా ఉక్రెయిన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంతా కుదిరితే త్వరలోనే ఇంటికి తిరిగొస్తాను. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని హరీష్ చెప్పగా.. నువ్వు క్షేమంగా తిరిగొస్తే చాలు అంటూ విద్యార్థి తండ్రి అన్నారు.


Also Read: PM Modi Meeting: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్, భారతీయుల తరలింపుపై చర్చ!


Also Read: Mangalagiri: కుర్రాడ్ని పంపిస్తే సరుకుల డబ్బులు ఇస్తా - తీరా వెళ్లి చూస్తే మైండ్ బ్లాక్