అనంతపురం జిల్లా బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు ఆందోళనకు దిగారు. భర్త పేరు మీదున్న భూమిని తన పేరుపై మార్చుకునేందుకు ఏడేళ్లుగా మహిళ తహసీల్దార్ కార్యాలయం చుట్టూతిరిగిందని బంధవులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామంలో  పెద్దన్న అనే వ్యక్తి పేరు మీద ఐదు ఎకరాల పొలం ఉంది. పెద్దన్న ఏడు సంవత్సరాల క్రితం మరణించారు. పెద్దన్న మృతిచెందడంతో భర్తపేరు మీద ఉన్న భూమిని తన పేరుకు మార్చాలని లక్ష్మీ దేవమ్మ అధికారులను కోరింది. లక్ష్మీదేవమ్మ పేరపై మార్చేందుకు వీఆర్వో రూ.3 లక్షలు లంచం అడిగారని ఆమె కుమార్తెలు ఆరోపిస్తున్నారు. అంత డబ్బు ఇచ్చుకోవాలని కోరినా వీఆర్వో నాగేంద్ర వినలేదన్నారు. 


Also Read: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..


తహసీల్దార్ కార్యాలయంలో మృతదేహంతో నిరసన


భూమి దక్కకుండా పోతుందని మనోవేదనకు గురైన తల్లి లక్ష్మీ దేవమ్మ మృతి చెందిందని కూతుళ్లు ఆరోపిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలోని టేబుల్ పై పెట్టి ఆందోళనకు దిగారు. లంచం అడిగిన వీఆర్వో నాగేంద్రని సస్పెండ్ చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించారు. వారిని స్థానికులు అడ్డుకున్నారు. తహసీల్దారు సెలవులో ఉన్నారని రెవెన్యూ సిబ్బంది వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ కార్యాలయం నుంచి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.




Also Read: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్


మానసిక ఆవేదనతో మహిళ మృతి..! 


లక్ష్మీదేవి (70) అనే మహిళా రైతుకు జలాలపురం గ్రామంలో 19.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భర్త పెద్దన్న పేరున ఉన్న భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం తన పేరుతో ఇవ్వాలంటూ ఏడేళ్లుగా బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయం చుట్టూ లక్ష్మీదేవమ్మ  తిరిగింది. ఇటీవల ఆమె అనంతపురం నవోదయ కాలనీలోని తన కుమార్తె నాగేంద్రమ్మ వద్ద ఉంటోంది. మంగళవారం ఉదయం లక్ష్మీదేవమ్మ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వకపోవడం వల్లే తన తల్లి మానసిక ఆవేదనతో మృతి చెందిందంటూ ఆమె ఇద్దరు కుమార్తెలు నాగేంద్రమ్మ, రత్నమ్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో లక్ష్మీదేవమ్మ మృతదేహాన్ని బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయానికి తీసుకెళ్లి తహసీల్దారు టేబుల్‌పై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. 




Also Read:  ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి