8th Class Student Drew A Portrait Of CM Chandrababu: ఓ విద్యార్థిని సీఎం చంద్రబాబుపై (CM Chandrababu) అభిమానంతో ఆయన చిత్ర పటాన్ని అద్భుతంగా గీసింది. అనంతరం నేరుగా ఆయన్ను కలిసి తీపి జ్ఞాపికను అందించింది. దీన్ని చూసిన ముఖ్యమంత్రి మురిసిపోయారు. విద్యార్థినిని అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ (Vijayawada) పటమటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాస్యకు సీఎం చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. ఈ క్రమంలో తన స్వహస్తాలతో ఆయన చిత్రపటాన్ని అద్భుతంగా గీసింది. అంతేకాకుండా 'సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక' అటూ చిత్రంపై రాసింది. దీన్ని తీసుకుని సోమవారం సచివాలయానికి వచ్చింది. 




మురిసిపోయిన సీఎం


ఈ చిత్రాన్ని విద్యార్థిని లాస్య సీఎం చంద్రబాబును నేరుగా కలిసి అందజేసింది. చిన్నారి అభిమానం, ఆమె ప్రతిభకు ఆయన మురిసిపోతూ విద్యార్థినిని అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.


Also Read: Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు, బుకింగ్ ప్రాసెస్ ఇలా!