RGV  Nagababu social media war :  రామ్ గోపాల్ వర్మ, నాగబాబుల మధ్య సోషల్ మీడియాలో వాగ్వాదం జరుగతోంది.  ఓ న్యూస్ ఛానెల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీ తల నరికి తీసుకుని వస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన అంశం వివాదాస్పదమయింది. దీనిపై విజయవాడకు వెళ్లి డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు చేశారు.  టీవీ యజమాన్యం, టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు , యాంకర్‌ సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు.                                                    


దీనిపై  మెగా బ్రదర్‌ నాగబాబు స్పందించారు.  ”ఆర్జీవీగారు మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇండియాలోనూ ఏ పనికిమాలిన వెదవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవడు చంపడు కదా.. సో మీరేం వర్రీ అవకండి. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు’ అంటూ ఆర్జీవీకి కౌంటర్‌ ఇచ్చారు.                                        




నాగబాబు కౌంటర్ వైరల్ అవడంతో.. ఆర్జీవీ వెటకారంగా స్పందించారు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి’ అంటూ సెటైర్లు వేశారు.  





 


దీనిపై వెంటనే నాగబాబు కూడా స్పందించారు.  వర్మ గారు మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్ కి కూడ గురయ్యాను ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు మీ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి మీరు, Any how ఏదోక రూపం లో నా పోస్ట్ కి Answer ఇచ్చినందుకు సంతోషం,ఎప్పటికి మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని కౌంటర్ వేసారు.                     



ఈ ట్వీట్‌కు ఆర్జీవీ ఎలా స్పందిస్తారో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.