Sajjala Comments Against Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో పెద్ద ఎత్తన చర్చ జరుగుతోంది. కేవలం చర్చ మాత్రమే కాదు, ఆ స్థాయిలో కౌంటర్లు ఇచ్చేందుకు సైతం పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్ళాయి. గతంలో చంద్రబాబుపై ఎక్కవగా మాట్లాడే సజ్జల ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై స్పందించడంతో రాజకీయాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. 


పవన్ కామెంట్స్ పై చర్చ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి మూడో విడత యాత్రలో మాటల తూటాలను పేల్చుతున్నారు. అధికార వైఎస్ఆర్ సీపీపై నేరుగా మాటల దాడి ప్రారంభించారు. కేవలం పార్టి నేతల మీదనే కాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని పవన్ కామెంట్స్ హీట్ పెంచారు. సీఎం జగన్ టీం పై పవన్ నేరుగా విమర్శలు చేయటం వైసీపీ నేతలకు  మింగుడు పడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి దండుపాళ్యం బ్యాచ్ అంటూ పవన్ కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు పవన్ తో పాటుగా చంద్రబాబు పై ఎదురు దాడి ప్రారంభించారు.


రంగంలోకి దిగిన సజ్జల...
పవన్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ కావటంతో అటు పార్టీ ప్రదాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా రంగంకి దిగారు. పవన్ కామెంట్స్ పై ఇప్పటివరకు అంతగా స్పందించనని సజ్జల ఎకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇప్పటివరకు చంద్రబాబు, తెలుగుదేశం పార్టి నాయకులను ఉద్దేశించి మాత్రమే సజ్జల ఎక్కువగా మాట్లాడే వారు. అయితే సోమవారం జరిగిన ప్రెస్ మీట్ లో మాత్రం సజ్జల ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. పవన్ చేసిన కామెంట్స్ ఏకపక్షంగా ఉన్నాయని అంటున్నారు. 
గత కొన్ని రోజులుగా తండ్రి, కొడుకు,  దత్తపుత్రుడు  ముగ్గురు  మూడు  మార్గాలు ఎంచుకుని  విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాల పై రెచ్చకొడుతూ, విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఏ చట్టం, రాజ్యాంగం, పార్లమెంటరీ భాష అవసరం లేని విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైజాగ్ లో పవన్ కారు కూతలు కూశారని వ్యాఖ్యానించారు. అయితే అవన్నీ సినిమా లోనే  సాధ్యం  అవుతాయని, సినిమా  స్క్రీన్ పై  సాధ్యమయ్యే  పనులే పవన్ బయట చేస్తున్నారని ధ్వజమెత్తారు. 


అంగళ్ళు పుంగనూరు లో కూడా చంద్రబాబు  రెచ్చగొట్టే  పని  చేసారని, అంగళ్ళు లో  పోలీసులు సంయమనం పాటించకపోతే పరిస్థితి  వేరే  విధంగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖలు రాశారని, ఏదో  ఘోరం  జరిగిందని క్రియేట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు సీబీఐ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఇప్పుడు తనకు ఎదో జరిగిందని చిందిలు తొక్కుతున్న చంద్రబాబు సీబీఐ విచారణ కావాలటున్నారని,  అధికారంలో ఉన్నప్పుడు  సీబీఐ ని ఎందుకు వద్దన్నారో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అనే తోడేలు ఎన్టీఆర్ దగ్గర  చేరడమే ఒక చారిత్రక  తప్పిదంగా అభివర్ణించారు. ఎన్టీఆర్ ఈ రోజు ఉంటే చంద్రబాబు వల్ల రాష్ట్రానికే నష్టం అని తప్పకుండా  అనుకునేవారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో  ఓటమి ఓటమే అవుతుందని సజ్జల వ్యాఖ్యానించారు.