YSR Matsyakara Bharosa: వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.  వరుసగా ఐదో ఏడాది లబ్ధిదారుల ఖాతాల్లో వేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు విడుదల చేశారు సీఎం జగన్. బటన్ నొక్కి మరీ లక్షా 23 వేల 519 మంది మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.123.52 కోట్లను విడుదల చేశారు. జీవనోపాధి కోల్పోయిన 23 వేల 458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు.


సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తున్నారు. టీపీడీ ప్రభుత్వం తొలి రెండేళ్లలో రూ.2 వేల చొప్పున ఇవ్వగా.. ఆ తర్వాత రూ.4 వేల చొప్పున ఇచ్చారు. మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారు. ఇలా సగటున 50 వేల మందికి రూ.21 కోట్ల మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భృతి రూ.10 వేలకు పెంచింది. మర యాంత్రిక పడవలతోపాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు కూడా లబ్ధి చేకూర్చింది.   


ఫిష్ ఆఁధ్ర బ్రాండ్ ద్వారా దేశీయ వినియోగం పెంచడంతో పాటు వాటికి అనుసంధానంగా నాలుగు వేల రిటైల్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో 2 వేల 184 రిటైల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా అభివృద్ధి చేసిన వెబ్ అప్లికేషన్ ఈ మత్స్యకార్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 155251 ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. 


మత్య్సకారులకు రూ. 10 వేల భృతి 


2012లో జీఎస్‌పీసీ తవ్వకాలతో అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14,824 మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 70.04 కోట్ల పరిహారం చెల్లించింది. ఈరోజు అందించిన ఆర్ధిక సాయంతో కలిపి ఇప్పటి వరకు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద మొత్తం సాయం రూ. 526 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ద్వారా సముద్రంలో చేపల వేట నిషేద సమయంలో ఇచ్చే భృతిని రూ. 10 వేలకు పెంచి మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలను కూడా చేర్చి చెల్లిస్తోంది.


Also Read: ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాక్ - ఆ రూల్ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం!


డీజిల్ సబ్సిడీ రూ.9  


గతంలో డీజిల్‌ ఆయిల్‌పై సబ్సిడీ లీటర్‌కు రూ. 6.03 ఉంటే వైసీపీ ప్రభుత్వం రూ. 9కి పెంచింది. స్మార్ట్ కార్డులు జారీ చేసి డీజిల్‌ పోయించుకునేటప్పుడే సబ్సిడీ లబ్ధిదారులకు నేరుగా అందేలా ఏర్పాటు చేసింది. వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు చెల్లించే పరిహారం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 3,606 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్‌ హర్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గత ప్రభుత్వం సముద్రంపై చేపల వేట నిషేద కాలంలో మత్స్యకార కుటుంబాలకు కేవలం రూ. 4 వేలు చెల్లించేది. 


Also Read:దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు - మంత్రి పెద్దిరెడ్డి