AP Chits New Law :   ఏపీలో చిట్ ఫండ్ సంస్థల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారేమోనని పలు సంస్థలపై దాడులు చేసి కేసులు పెట్టిన ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు వచ్చింది.  చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది  ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ఇందు కోసం ఈ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. మంత్రి ధర్మన ప్రసాదరావు ఈ చిట్స్ విధానాన్ని ప్రారంభించారు. . ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది.  ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.                              


ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ- చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానం ప్రారంభిస్తున్నామని.. చందాదారులు అంతా ఈ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు.. చిట్స్‌ వేసే చందాదారు మోస పోకుండా చూడాలనే ఈ విధానం అని పనిచేస్తుందన్నారు మంత్రి ధర్మాన.. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారన్న తెలిపారు.. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్‌లు నిర్వహించాలి.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు.                       


అంతకు ముందు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన  రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.  సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై కుట్ర చేస్తున్నారన్నారు.  స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్ళు అయినా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడే ఉన్నాయన్నారు.. గత ప్రభుత్వాలు ఈ పరిస్థితిని సరిదిద్దలేక పోయాయన్న ఆయన.. వైఎస్‌ జగన్ ప్రభుత్వమే ధైర్యంగా అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారు.. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.                  


బటన్ నొక్కి పథకాలు అందిస్తున్నారు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యంగంగా మాట్లాడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు మంత్రి ధర్మాన.  ఇన్నేళ్ళు అయినా 21 శాతం మంది అక్షరం ముక్క రాని వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందని ఆయన ప్రశ్నించారు.  ఇది పాలనలోని లోపం కాదా? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇదే ప్రయత్నం 50 ఏళ్ల కిందటే చేసి ఉంటే.. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో రకంగా ఉండేదని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.