YS Sharmila: తలా తోక లేని వివరణ ఇస్తారేంటి? అచ్చెన్నాయుడుపై వైఎస్ షర్మిల

Sharmila Counter to Atchannaidu : సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అని మంత్రి అచ్చెన్నాయుడును షర్మిల ప్రశ్నించారు.

Continues below advertisement

YS Sharmila:  ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటర్లు కూటమికి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. రైతు పక్షపాతిగా ఉంటామని ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు పక్షపాతిగా ఉంటామని హామి ఇచ్చి నేడు పట్టించుకోవడం లేదంటూ ట్విట్టర్‌ ఎక్స్‌ వేదిక ద్వారా ఆరోపించారు. ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడి కి రైతుల బాధలు కనిపించడం లేదంటూ విమర్శించారు. పల్నాడు జిల్లాలో విత్తనాల కోసం రాత్రి సమయాల్లో కూడా క్యూలైన్లో నిలబెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కుండపోత వర్షంలోనూ మహిళలు విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

Continues below advertisement

విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేకుండా ఉందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. దీనిపై ఆమె ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా? సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా? రాత్రంతా క్యూలైన్లో రైతులను నిలబెట్టడమా మీ ఎన్డీఏ ప్రభుత్వ కట్టుబడి? సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు అని విమర్శలు గుప్పించారు.

 రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని గుంజుతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా… మీకు పట్టం కట్టింది. జగన్ నిండా ముంచారు అనే కదా 11 సీట్లకు పరిమితం చేసింది. మోసం చేశారు అనే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రైతులను వ్యతిరేకించే బీజేపీ తో మీరు కూటమి కట్టి, పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి, గద్దెనెక్కి, ఇప్పుడు వాళ్లను వర్షంలో నిలబెట్టారు. ఇది మీ సర్కారుకి న్యాయమా? అంటూ షర్మిల అన్నారు. 

‘నాట్లు వేసిన 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని జేజీఎల్ – 384 రకం విత్తనాలను కావాలని అడగడం రైతులు చేసిన పాపం అంటారా మంత్రిగారు! రైతు అడిగింది ఇవ్వాలని హక్కుగా మేము ప్రశ్నిస్తే… రెచ్చ గొట్టినట్లు ఎలా అవుతుందో , వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి’ అని  షర్మిల మంత్రి అచ్చెన్నాయుడును నిలదీశారు.
 

Continues below advertisement
Sponsored Links by Taboola