YS Jagan announces YSRCP Porubata schedule | అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. ఆరు నెలల పాలనతో కూటమి సర్కార్ అన్ని విభాగాలలో వైఫల్యం చెందిందన్న ఏపీ మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పోరుబాట కార్యాచరణను ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పోరుబాట కార్యాచరణ వివరాలు వెల్లడించారు. 


డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు
రాష్ట్రంలోని రైతుల సమస్యలు, కరెంట్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్ మెంట్‍పై పోరాటం చేయాలని వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 11న రైతు సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. రూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని కూటమి సర్కార్ ను డిమాండ్ చేయనున్నారు. ఉచిత పంటల బీమా పునరుద్ధరణ చేయాలని డిమాండ్ 


కరెంట్ ఛార్జీల పెంపుపై 27న ఆందోళనలు 
అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి.. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు తక్షణం ఉపసంహరించుకోవాలని జగన్ డిమాండ్ చేయనున్నారు. కరెంట్ ఛార్జీల పెంపు సమస్యపై SE, CMD కార్యాలయాలకు ప్రజలతోపాటు ర్యాలీగా వెళ్లి విజ్ఞాపన పత్రాలు వైసీపీ అందించనుంది.



జనవరి 3న ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరుబాట  - రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు ఇవ్వాలని విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం