అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు విధివిధానాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆయా సచివాలయాల్లో ఎంత మంది సిబ్బంది ఉండాలి బదిలీలకు సంబంధిచి నియమ నిబంధనలు వెల్లడిస్తూ సర్కులర్ జారీ చేసింది. ఈ మేరకు జిఎస్ డబ్ల్యూఎస్ శాఖ నేతృత్వంలో సర్కులర్ జారీ చేశారు. అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాలి. ఒకవేళ 5 ఏళ్ల సర్వీసు పూర్తికాని వారైనా వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ సొంత మండలాలకు బదిలీ చేయడానికి లేదని రూల్ పెట్టారు.

సచివాలయ ఉద్యోగుల విధివిధానాలు

- గ్రామ వార్డు సచివాలయాల్లో మే 31 నాటికి  5 ఏళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ఖచ్చితంగా బదిలీ చేయాలి 

- సచివాలయాల్లో 5 ఏళ్లు సర్వీసు పూర్తికాని వారు కూడా వ్యక్తిగత అభ్యర్ధన ద్వారా బదిలీ కోరవచ్చు.  వీరిని ఎవ్వరిని సొంత మండలానికి బదిలీ చేయడానికి వీలులేదని వెల్లడి

- జీఎస్‌డబ్ల్యూ శాఖ హెచ్ ఆర్ ఎమ్ ఎస్ పోర్టల్ ను ఎనేబుల్ లో ఉంచింది

- జిఎస్డబ్ల్యూ లో పోర్టల్ లో ఆన్ లైన్ ద్వారా 5 సర్వీరు పూర్తిచేయని వారు ట్రాన్స్ఫర్ కు అమరావతి

- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు విధివిధానాలు జారీ

- ఆయా సచివాలయాల్లో ఎంత మంది సిబ్బంది ఉండాలి బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు వెల్లడిస్తూ సర్కులర్ జారీ

- ఈ మేరకు జిఎస్‌డబ్ల్యూఎస్ శాఖ నేతృత్వంలో సర్క్యూ జారీ అభ్యర్ధన చేసుకోవచ్చు

- జిల్లా హెచ్‌వోడి మాడ్యూల్ లోని హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ లో ఖాళీలు కనిపించేలా ఏర్పాటు

- ఉమ్మడి జిల్లాల కలెక్టర్ లు వారి బదిలీలకు సంబంధించిన ఆర్డర్లు ఇవ్వాలని సర్కులర్ లో పేర్కొన్న ప్రభుత్వం

- ఉమ్మడి జిల్లానే ప్రాతిపదికగా బదిలీలు

- ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ లు ఇచ్చే సమయంలో పలు క్యాటగిరీలకు ప్రాధన్యం ఇవ్వాలని సర్కులర్ లో వెల్లడి.

- కంటి చూపు సరిగాలేని వారు, మానసిక రుగ్మతలతో భాదపడే పిల్లలుఉన్నవారిని మెడికల్ ఫెసిలిటీ ఉన్న చోటికి 

- రెండేళ్లకు పైగా గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారిని, 40శాతం కంటే ఎక్కవ డిసెబిలిటీ ఉన్న వారు సర్టిఫికెట్ పరిశీలించి ప్రాధాన్యం ఇవ్వడం

- మెడికల్ గ్రౌండ్స్ లో తనకు, భార్యా, పిల్లలకు ఇబ్బందులు ఉన్నప్పడు, దీర్ఘకాలిక వ్యాదులతో భాదపడుతున్నప్పుడు వారికి ప్రాధాన్యం

-  కారుణ్య నియామకం కింద నియమితులైన ఒంటరి మహిళలతో పాటు పలు ఇతర సర్క్యూలర్ తెలిపిన ఇతర క్యాటగిరిలకు ప్రాధాన్యం

- ట్రాన్స్‌ఫర్ల టెంటిటివ్ షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఈమేరకు జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఎం శివ ప్రసాద్ సర్కులర్ జారీ చేశారు.