పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలను దాచేందుకు ముఖ్యమంత్రి జగన్, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రికి సిగ్గు లేదంటూ ఆయన ఫైర్ అయ్యారు.


సీఎం పోలవరం టూర్ పై ఎందుకు రహస్యం.. దేవినేని ఉమా
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి నిర్మించిన  గైడ్ బండ్ కుంగుబాటుకు గల కారణాలపై  చర్చలు జరిపేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కువెళ్ళి వచ్చారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టి నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ వ్యవహారాన్ని పోలవరంప్రాజెక్ట్ అథారిటీ విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్  కి తెలియచేయడంవల్లే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు  మీడియాను ముఖ్యమంత్రి  ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. కేవలం సాక్షి మీడియాకు, ఐ అండ్ పీ.ఆర్ విభాగానికి మాత్రమే ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలన్నారు.  ఇతరమీడియా సంస్థలు, ప్రతినిధుల్ని ఎందుకు పోలీస్ వలయంలో ఉంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటన వివరాల్ని మీడియాకు తెలియకుండా ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. జగన్ పోలవరం ఎత్తుని తగ్గిస్తాడన్న కేసీఆర్ వ్యాఖల్ని ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎందుకు ఖండించలేదో చెప్పాలన్నారు.


వాళ్ళకు సిగ్గు లేదు...
ముఖ్యమంత్రి జగన్, ఇరిగేషన్ మంత్రి అంబటి సిగ్గులేకుండా ఎన్నాళ్లు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చుతారని దేవినేని ఉమా అన్నారు. ప్రభుత్వానికి ఇంకా 278 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్లలో కేవలం 4సార్లు మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ పోలవరం బ్యారేజ్ గా ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. 150 అడుగులఎత్తులో కట్టాల్సిన పోలవరం డ్యా మ్ ని  135 అడుగుల ఎత్తులోనే నీళ్లు నిలబెట్టడానికి రూ.12,911కోట్లకు ఎందు కు ఆమోదం తెలిపారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.  కమీషన్ల కక్కుర్తి కోసం.. రివర్స్ టెండరింగ్ లోపోయిన డబ్బుని రాబట్టుకోవడానికే ముఖ్యమంత్రి పోలవరా న్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.  


ఎంపీలు ఉండి ఏం చేశారు...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి  31మంది ఎంపీలు ఉన్నా నాలుగు సంవత్సరాల్లో జగన్ పోలవరం నిర్మాణానికి ఎన్నినిధులు తెచ్చారో చెప్పాలన్నారు. చేసిన ఉత్తుత్తి పనులకు సంబంధించిన నిధుల్ని కూడా కేంద్రం నుంచి ఎందుకు రాబట్టులేకపోతున్నారని అన్నారు.చంద్రబాబు  నాయకత్వంలో రూ.11,537 కోట్లు ఖర్చుపెట్టి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 72శాతం పూర్తయిందని, 28సార్లు చంద్రబాబుగారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించారని అన్నారు. చంద్రబాబు రూ.11,537 కోట్లకు పనులు చేశారని, ప్రాజెక్ట్ డీ.పీ.ఆర్-2 మొత్తానికి 2019 ఫిబ్రవరిలోనే రూ.55, 546 కోట్లకు అనుమతులు పొందారని తెలిపారు. చేతిలో 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి నేటికీ డీ.పీ.ఆర్-2 కి సంబంధించి కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు పొందలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన 31మంది ఎంపీలను బాబాయ్ హత్య కేసు నుంచి అవినాశ్ రెడ్డిని బయటపడేయటానికే వినియోగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. 


నిర్వాసితులకు నష్టపరిహారం..
ప్రాజెక్ట్ ఎత్తుతగ్గించినా, నీటి నిల్వసామర్థ్యం తగ్గించినా జగన్ రెడ్డి  20వేల నిర్వాసితకుటుంబాలకు న్యాయంచేయాల్సి ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. జూలైలో వరదలు రాబోతున్న వేళ వారిని ఆదుకోవడానికి జగన్  ప్రభుత్వం ఏం చేయబోతోందని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్ట్ ను తాను అనుకుంటున్నట్టు జగన్ రెడ్డి 135 అడుగులకే పరిమితంచేసినా కూడా ఇప్పటికీ 20వేల నిర్వాసిత కుటుంబాలకు పైగా న్యాయం చేయాల్సి ఉందని,195 టీఎంసీల నీళ్లు నిల్వ చేయాల్సిన పోలవరం డ్యామ్ ని కేవలం 92టీఎంసీలకే పరిమితం చేయడానికి ఎందుకు ఆరాటపడుతున్నారో చెప్పాలన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకనే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ పరిధిలోని గుంతల్ని ఇసుక తోపూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారి ఎద్దేవా చేశారు.