మంగళగిరిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో వివాదం చెలరేగుతోంది. తొలగించిన చోటే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మంగళగిరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు రూ.2 భోజనం పెడతామని టీడీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.


లక్షమందితో ఛలో మంగళగిరి
అయితే, అన్నా క్యాంటీన్ ఏర్పాటుకి అంగీకరించేది లేదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, అన్న క్యాంటీన్ ఏర్పాటుకి అడ్డు తగిలితే భారీగా ఉద్యమించాలని టీడీపీ నిర్ణయించింది. త్వరలోనే లక్ష మందితో అన్న క్యాంటీన్ - ఛలో మంగళగిరి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.


గురువారం రెండుసార్లు ధ్వంసం
పేదలకు రూ.2 కే అన్నం పెట్టే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌ను మున్సిపాలిటీ అధికారులు గురువారం (జూన్ 9) ధ్వంసం చేశారు. కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఎన్టీఆర్‌, డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌.కోటేశ్వరరావుల విగ్రహాల సమీపంలో క్యాంటీన్‌ ఏర్పాట్లు చేసుకున్నారు. నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా దీనిని ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ చెప్పారు. ఇదే ప్రదేశంలో చలివేంద్రం ఏర్పాటు చేసి కొన్ని నెలలుగా ఫ్రీగా మజ్జిగ, తాగునీరు జనాలకు ఇస్తున్నారు. గతంలో ఉన్న ప్లాట్‌ఫారంపైనే క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తున్నామని, మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఏర్పాట్లను తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తు్నారు. 


మళ్లీ తిరిగి క్యాంటీన్‌ ఏర్పాటు చేయగా.. గురువారం రాత్రి మళ్లీ భారీ సంఖ్యలో పోలీసులు, అధికారులు వచ్చి నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ నేతలు అక్కడికి చేరుకొని అన్న క్యాంటీన్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.