Fire Accident Near Jagan Home | అమరావతి:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద మంటల ఘటనపై తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా వైసీపీ ఆఫీసుకు నోటీసులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఘటనపై పూర్తి వివరాల కోసం సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ ఇంటి సమీపంలో మంటలలో మర్మమేంటో తేల్చే పనిలో తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.

Continues below advertisement


అయితే వైసీపీ ఆఫీసుకు పోలీసుల నోటీసులపై మాజీ సీఎం జగన్‌ టీం నుంచి, వైసీపీ ఆఫీసు నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మాజీ సీఎం జగన్ ఇంటి సమీపంలో అగ్నిప్రమాదంపై టీడీపీ స్పందించింది. అటు సిట్ పడింది.. ఇటు తగలబడింది అంటూ ఆ అగ్ని ప్రమాదంపై అంటూ టీడీపీ ఖాతాలో ట్వీట్ చేసింది. సిట్ పడగానే రాత్రికి రాత్రే తాడేపల్లి ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిందంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అసలే వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది.


Also Read: Delhi Election Results: ఢిల్లీలో ఫలించిన చంద్రబాబు మ్యాజిక్ - రేవంత్ రెడ్డికి మరో రాష్ట్రంలో చేదు అనుభవం!