రాజధాని ఉద్యమానికి సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న బిజెపి నేత సత్య కుమార్ భౌతిక దాడికి పాల్పడటాన్ని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ దాడి జరిగిందని ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పార్టీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎంపీ సురేష్ కోరడాన్ని వీర్రాజు తప్పు పట్టారు. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఆయన స్పష్టం చేశారు


వైసీపీ పైమండిపాటు..
మందడం వద్ద భారతీయ జనతా పార్టీ నేతలపై దాడి ఘటనకు అధికార పార్టీయే కారణమని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 1200 వ రోజుకు‌ చేరిందని అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. అమరావతి రైతులకు మద్దతు ఇచ్చి వస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ పై‌ దాడి‌ చేయటం ఏంటని వీర్రాజు అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం చేసిన దాడిగా భావిస్తున్నామన్నారు. యాదవ్‌తోపాటు సురేష్ పై పడి‌ విచక్షణారహితంగా కొట్టారని ఈ‌దాడి ప్రభుత్వం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.


వైసిపి గుండాలతో కొట్టిస్తారా.. అదీ పోలీసులు సమక్షంలోనే జరిగటం హేయమని అన్నారు సోమువీర్రాజు. దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు నిచ్చామని చెప్పారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలిపారు. హత్యాయత్నం కేసు, దాడి , కుట్ర కేసులు పెట్టాలని ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన‌ చేయక పోవడం అనుమానాలు పెంచుతుందన్నారు.


ఎంపీ చేతకాని ప్రకటన చేస్తున్నారు: వీర్రాజు
భారతీయ జనతా పార్టీ నేతలే దాడికి పాల్పడ్డారని, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ చేతకాని ప్రకటనలు‌ చేస్తున్నారని వీర్రాజు అన్నారు. తమ వాళ్లకు దాడి‌ చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. భారతీయ జనతా పార్టీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని పథకం రూపొందించారని, చట్టాలతో ‌వేరే విధంగా‌ వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీ సహించదని హెచ్చరించారు.


హైకమాండ్‌కు ఫిర్యాదు...
ఉద్యమం అంటే రెచ్చగొట్టే ధోరణే వైఎఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరని భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు సొము వీర్రాజు వ్యాఖ్యానించారు. దాడి జరిగిన తీరుపై పార్టీ హైకమాండ్ కు నివేదిక పంపామని తెలిపారు.  పాత్రధారులు, సూత్రధారులు ఎవరో కూడా అందులో‌ వివరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి డైరెక్షన్, సపోర్ట్ తమకు అవసరం లేదని, మా పోరాటం మేము‌ చేస్తామన్నారు.


అమరావతే రాజధాని...
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేదే బీజెపీ ‌విధానమని వీర్రాజు వెల్లడించారు. అందుకే మొదటి నుంచీ ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. విజయవాడలో మూడు ఫ్లైఓవర్లు నిర్మాణం చేసిందని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం తీర్మానం‌ చేస్తే కర్నూలులో హైకోర్టును పెడతామన్నారు. మూడు రాజధానుల పేరుతో మాయ చేసింది వైసీపీనేనని, విశాఖ అభివృద్ధి అన్నవాళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తాడేపల్లిలో ఇల్లు, అభివృద్ధి అన్న జగన్ ఎందుకు మాట మార్చారో చెప్పాలన్నారు. ప్రజలను మోసం‌ చేసే వైసిపి నేతలకు బిజెపిని ప్రశ్నించే అర్హత లేదన్నారు. సిఎం కు‌ చెప్పి సజ్జల నిధులు ఎందుకు ఇప్పించలేక పోయారో చెప్పాలన్నారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవటం వెనుక ఆంతర్యం ఏంటని వీర్రాజు ప్రశ్నించారు.