Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు పాలన ఒక పీడకల, ఆయనలా మేం హడావుడి చెయ్యం - సజ్జల

చంద్రబాబు పాలన రాష్ట్ర ప్రజలకు ఓ పీడకల అని సజ్జల విమర్శించారు. గురువారం (ఆగస్టు 3) తాడేపల్లిలో సజ్జల ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

Continues below advertisement

చంద్రబాబు తరహాలో తమ ప్రభుత్వం హడావుడి చేయడం లేదని, వరద బాధితులకు నేరుగా సాయం అందిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబులా తమ ప్రభుత్వం ఎవరికీ దోచి పెట్టడం లేదని అన్నారు. చంద్రబాబు పాలన రాష్ట్ర ప్రజలకు ఓ పీడకల అని సజ్జల విమర్శించారు. గురువారం (ఆగస్టు 3) తాడేపల్లిలో సజ్జల ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

Continues below advertisement

జగన్ ప్రభుత్వంలో అర్హత వున్నవారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పథకాలు అందిస్తామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకే అందిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతోందని అన్నారు.  రాష్ట్రంలో కోటి 46 లక్షల కుటుంబాలను కలిశామని అన్నారు.

Continues below advertisement