జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తదుపరి షెడ్యూల్ ఖరారు అయింది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. దీంతో యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ ను ఈ రోజు (జూలై 6) సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి ఖరారు చేశారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించారు. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు జనసేన పార్టీ నేత పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Pawan Kalyan: వారాహి విజయయాత్ర రెండో షెడ్యూల్ తేదీ ఖరారు, అక్కడి నుంచే ప్రారంభం
ABP Desam | 06 Jul 2023 09:47 PM (IST)
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి ఖరారు చేశారు.
రెండో షెడ్యూల్ ఖరారు చేస్తున్న పవన్ కల్యాణ్