Palnadu: కోళ్లను కర్రలతో కొట్టి చంపిన దుండగులు, 2 లక్షల నష్టం - మహిళ బాధ వర్ణనాతీతం!

Palnadu: పల్నాడు జిల్లాలో కొందరు దుండగులు కోళ్ల ఫాంపై దాడి చేసి కర్రలతో కోళ్లను చంపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ కోరింది.

Continues below advertisement

Palnadu: పల్నాడు జిల్లా రాజుపాలెం మండల పరిధిలోని కొండమోడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళకు చెందిన కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. లక్ష్మీ అనే మహిళ స్థానికంగా ఉంటూ నాటు కోళ్ల ఫామ్ ను ఏర్పాటు చేసుకుంది. కోళ్ల ఫారానికి వాచ్ మెన్ కూడా ఏర్పాటు చేసింది. నాటు కోళ్లను సిద్ధం కావడంతో కోళ్లను విక్రయిస్తామని గ్రామంలో టంకా వేయించారు.

Continues below advertisement

రాత్రి వేళ నాటు కోళ్ల ఫాం మీద కొందరు దుండగులు దాడి చేశారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కోళ్లపై దాడి చేయడంతో అవన్నీ రక్తమోడి చనిపోయాయి. కష్టపడి పెంచిన కోళ్లు అమ్మకానికి పెట్టి రూపాయి కూడా సంపాదించుకోకుండానే ఇలా దుండగులు కోళ్లు అన్నింటినీ చంపేయడంతో లక్ష్మీ కన్నీరు మున్నీరుగా విలపించింది. దాదాపు రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు లక్ష్మీ ఆవేదన చెందింది. లక్ష్మీ విలపించడం చూసిన గ్రామస్థులు ఆవేదన చెందారు. తనకు న్యాయం చేయాలని, తనను తీవ్ర నష్టానికి గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లక్ష్మీ కోరింది.

Continues below advertisement