అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న వార్త కథనాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. చైతన్య రథం పత్రిక ఎడిటర్, నిర్వహణ ఎవరు చేస్తున్నారు అని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సీఐడీ అధికారులు టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లి నోటీసులు అందించారు.
తనపై చైతన్య రథంలో తప్పుడు కథనాలు ప్రచురించారని మంత్రి బుగ్గన ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన కథనాల వివరాలను అందిస్తూ చైతన్య రథం పత్రికపై మంత్రి బుగ్గన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పేరిట నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట తయారుచేసిన నోటీసులను టీడీపీ ఆఫీసుకు వెళ్లి లాయర్ కు ఇచ్చారు సీఐడీ అధికారులు. చైతన్య రథం ఎడిటర్, కథనాలపై ప్రశ్నించిన సీఐడీ.. విచారణకు హాజరు కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులలో సూచించారు.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ సాక్షి దినపత్రికపై దాడులు చేయించగా.. ఇప్పుడు అధికార వైసీపీ నుంచి టీడీపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీడీపీ అనుబంధ చైతన్యరథం పత్రిక కథనాలపై వైసీపీ నేతల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీసుకు వెళ్లి జనరల్ సెక్రటరీ పేరిట నోటీసులు ఇవ్వగా, విచారణ హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు.