మాజీ సీఎం, టీడీపీ అధినేత అరెస్టు సందర్భంగా జరిగిన పరిణామాలపై కేంద్ర హోం శాఖ నివేదిక తెప్పించుకుంది. చంద్రబాబు ప్రత్యేక భద్రత కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ ఎజెన్సీ అధికారులు ...కేంద్ర హోం శాఖకు నివేదిక అందజేశారు. సెప్టెంబర్ 8 తేదీ అర్ధరాత్రి నుంచి 10 తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం, జైల్లో చంద్రబాబు భద్రత వంటి అంశాలను కీలకంగా ప్రస్తావించింది. 


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైడ్రామా నడిచింది. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబును నిద్రలేపి... 9వ తేదీ ఉదయం 6గంటలకు సీఐడీ అరెస్ట్ చేసింది. నంద్యాల నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తరలించింది. సీఐడీ కార్యాలయంలో గంటలపాటు విచారించింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత... మళ్లీ సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. 24గంటల సమయంలో మరో రెండు మూడు నిమిషాల సమయం ముగుస్తుండగా..చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 


8వ తేదీ రాత్రి నుంచి 10 తేదీ ఉదయం వరకు జరిగిన అన్ని అంశాలను సవివరంగా నివేదికలో పొందుపరిచారు ఎన్ఎస్జీ అధికారులు. భద్రత లేని కోర్టు హాలు బయట చంద్రబాబు ఉంచినట్లు పేర్కొన్న ఎన్ఎస్జీ...అదే రోజు రాత్రి 10గంటలకు రోడ్డు మార్గాన సెంట్రల్ జైలుకు తరలించారని నివేదికలో తెలిపింది.