Nitin Gadkari Chandrababu: అమరావతి: సంపద సృష్టికి మార్గాలు రహదారులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. రోడ్డు రవాణ, రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి రాష్ట్రంలో రూ. 5233 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.  ఉదయం అన్నదాత సుఖీభవ సంక్షేమ కార్యక్రమంలో రైతులకు డబ్బులు రైతుల ఖాతాలో వేశామని.. సాయంత్రం సంపద సృష్టికి రహదారుల శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నానని చంద్రబాబు అన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మరో రూ. 26 వేలకోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనల చేయగా వెంటనే కేంద్ర మంత్రి గడ్కరీ వేదిక మీద నుంచి ఆ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా మరో రూ.1 లక్ష కోట్ల మేర ప్రాజెక్టులను ఆమోదిస్తామని చెప్పారు. నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పోలవరానికి ఊపిరి పోశారు. గడ్కరీ అంటే పట్టుదల, కృషి, అంకిత భావం. ఏ మంత్రి అయినా.. తన శాఖ గురించే ఆలోచిస్తారు.. కానీ గడ్కరీ తీరు అందరికీ భిన్నంగా ఉంటుంది. 

గడ్కరీ రోడ్ల గురించే కాకుండా.. ప్రమాదాల నివారణ గురించి కూడా ఆలోచన చేశారు. పొలూష్యన్ ఫ్రీగా ఉండాలనే ఆలోచనతో గడ్కరీ ఉన్నారు. ప్రపంచంలో రోడ్ల ఇన్ఫ్రాలో దేశాన్ని నెంబర్-1 చేసే సామర్ధ్యం నితిన్ గడ్కరీకే ఉంది. గత ఐదేళ్లల్లో ఏపీ పరిధిలోని రోడ్లు శిధిలావస్థకు చేరాయి.. కానీ జాతీయ రహదారులు మాత్రం బాగున్నాయి. 2014 నాటికి ఏపీలో 4193 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారులు 8745 కిలో మీటర్లకు చేర్చారు. రాష్ట్రంలో రూ. 70 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. ఏడాదిలో సుమారు రూ.11 వేల కోట్ల విలువైన 760 కిలో మీటర్ల రోడ్లను నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఈ ఏడాదిలో 1000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం” అని చంద్రబాబు అన్నారు.

గడ్కరీ స్పూర్తితో హైదరాబాద్ ఓఆర్ఆర్మహారాష్ట్ర మంత్రిగా గడ్కరీ ఉన్నప్పుడే ముంబై నుంచి పుణే వరకు 1977-78 కాలంలో రహదారి నిర్మించారు. ఆ స్పూర్తితోనే నేను హైదరాబాదులోని ఓఆర్ఆర్ (Hyderabad ORR)ను 163 కిలోమీటర్లతో పీపీపీ పద్దతిన నిర్మించేందుకు నాడు ప్రణాళికలు సిద్దం చేశాం. ఇప్పుడు అమరావతికి 189 కిలో మీటర్ల మేర ఓఆర్ఆర్ (Amaravati ORR) అడిగాం.. దానికి అంగీకరించారు. ఏడు జాతీయ రహదారులను అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానం చేస్తుంది. విశాఖ, విజయవాడల్లో చేపడుతున్న మెట్రో రైళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది.

పీఎం సూర్య ఘర్, కుసుం పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ గురించి గడ్కరీ చెప్పడంతో ప్రతి ఇంటిపైనా కరెంట్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 జయప్రదం కావాలంటే.. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వేలు, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ మీద శ్రద్ధ పెట్టాలి. దక్షిణాదిలో అమరావతి-చెన్నై-బెంగళూరును కవర్ చేస్తూ బుల్లెట్ రైలు కావాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. జాతీయ రహదారులకు రెండు వైపులా గ్రీనరీ పెంచేందుకు అవసరమైన నిధులివ్వాలని కోరారు.

చంద్రబాబు అడిగిన వెంటనే గడ్కరీ మంజూరు చేసిన ప్రాజెక్టులివే..

హైదరాబాద్ - విజయవాడ రోడ్డు 6 లేన్లు - రూ.6700 కోట్లువిజయవాడ - మచిలీపట్నం రోడ్డు 6 లేన్లు -రూ.2600 కోట్లువినుకొండ- గుంటూరు రోడ్డు 4 లేన్లు - రూ.2605 కోట్లుగుంటూరు -నిజాంపట్నం రోడ్డు 4 లేన్లు - రూ.2000 కోట్లుబుగ్గకయిప - గిద్దలూరు రోడ్డు 4 లేన్లు -రూ.4,200 కోట్లుఆకివీడు- దిగమర్రు రోడ్డు 4 లేన్లు -రూ.2500 కోట్లుపెడన - లక్ష్మీపురం రోడ్డు 4 లేన్లు -రూ.4,200 కోట్లుముద్దునూరు -కడప రోడ్డు 4 లేన్లు -రూ.1182 కోట్లుహైదరాబాద్ -విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు.