ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఫైనల్ డ్రాఫ్ట్‌ను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడా దస్త్రం గవర్నర్‌ టేబుల్‌పై ఉంది. ప్రస్తుతం భువనేశ్వర్‌లో ఉన్న గవర్నర్‌ వచ్చిన తర్వాత ఆ ఫైనల్‌ డ్రాఫ్ట్‌పై సంతకం చేయనున్నారు. 

ప్రస్తుతం 13 జిల్లాలను పార్లమెంట్‌ ప్రాతిపదికన 26 జిల్లాలగా మార్చేందుకు కేబినెట్ ఆమెదించింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం అలాంటిదేమీ లేదని జగన్ తనకు నచ్చినట్టు ప్రక్రియను పూర్తి చేశారని ఆరోపిస్తున్నాయి. 

26 జిల్లాలతోపాటు 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 22 డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 

కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాలు ఇవే మన్యం జిల్లా

అల్లూరి జిల్లా

అనకాపల్లి జిల్లా

కోనసీమ జిల్లా

రాజమండ్రి జిల్లా,

నరసాపురం జిల్లా

బాపట్ల జిల్లా

నర్సరావుపేట జిల్లా

తిరుపతి జిల్లా

అన్నమయ్య జిల్లా

నంద్యాల జిల్లా

సత్యసాయి జిల్లా

ఎన్టీఆర్-విజయవాడ జిల్లా    

ఉగాది సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబుకు కూడా సీఎం జగన్ స్వీట్ న్యూస్ చెప్పారు. కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 

కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ గతంలో చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

కొత్తగా ఏర్పాటు అయ్యే రెవెన్యూ డివిజన్లుపలాస

కొత్తపేట

భీమవరం

ఉయ్యూరు

బొబ్బిలి

చీపురుపల్లి

భీమలి

తిరువూరు

నందిగామ

బాపట్ల

చీరాల

సత్తెనపల్లి

ఆత్మకూరు

డోన్

గుంతకల్‌

ధర్మవరం

పుట్టపర్తి

రాయచోటి

పలమనేరు

నగరి

శ్రీకాళహస్తి

కుప్పం

బాలకృష్ణ డిమాండ్‌ను మాత్రం జగన్ పట్టించుకోలేదు. హిందూపురాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని అప్పట్లో బాలకృష్ణ ఆందోళన చేశారు. అవసరమైతే జగన్‌ను కలుస్తానంటూ అప్పట్లో ప్రకటించారు. అయినా ఆ డిమాండ్‌ను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.