AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రక్రియను వేగవంతం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్న సమస్యలను పరిష్కరించి కొత్త జిల్లాలను ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్‌ 4న (AP CM YS Jagan To Announce News Districts On 4th April 2022) కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ 26 జిల్లాల రాష్ట్రంగా మారబోతోంది.


పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లాలను ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే గెజిట్‌ కూడా ఇచ్చింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించి కొత్త జిల్లాలపై ఫైనల్‌ డెసిషన్ తీసుకోనుంది. జిల్లాల పునర్విభజనపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏప్రిల్‌ 4ను ముహూర్తంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ రోజు కొత్త జిల్లాల అవిర్భవాన్ని ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. 


జిల్లాల విభజనపై గందరగోళం..  
జిల్లాల విభజన కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్రంలో చాలా గందరగోళం నెలకొంది. చాలా ప్రాంతాల్లో ప్రజల నుంచి కాకుండా వైసీపీ లీడర్ల నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజంపేట, హిందూపురం, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాలని జిల్లా కేంద్రాలుగా చేయాలని డిమాండ్లు గట్టిగా వినిపించాయి. నెల్లూరులో కూడా కొన్నిప్రాంతాలను వేరే జిల్లాల్లో కలపొద్దని నేతలు డిమాండ్ చేశారు.  వీటన్నింటిన పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే అంశంపై ఇంత వరకు క్లారిటీ లేదు. అసలు ఆ డిమాండ్‌లపై ప్రభుత్వం ఏం చెప్పబోతుందనేది ప్రస్తుతానికి ఆసక్తి నెలకొంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కోసం వేల సంఖ్యలో ప్రభుత్వానికి వినితలు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించారా... ప్రజలకు ఏం చెప్పబోతున్నారనేది తేలాల్సి ఉంది. 


ప్రజల నుంచి వస్తున్న వేల సంఖ్యలో వినతులను, ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించిందంటున్నాయని వైసీపీ వర్గాలు. దీనిపైనే  వినతులు, ఫిర్యాదుల పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ రోజు లేదా రేపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. ప్రజల నుంచి వేల సంఖ్యలో వచ్చిన వినతులను, ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపైనే సీఎం సమీక్ష నిర్వహించారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాలను ఖరారు చేసినట్టు తెలిసింది. సీఎం ఆమోదం తర్వాత నేరుగా మంత్రివర్గం ఆమోదానికి కూడా పంపించినట్టు సమాచారం. 


కొత్త జిల్లాల ఆమోదం కోసం వర్చువల్‌గా మంత్రివర్గం సమావేశమైంది. తుది జాబితాను ఆమోదించింది. చిన్న చిన్న మార్పులు చేర్పులతో 26 జిల్లాలను కేబినెట్‌  అంగీకరించినట్టు తెలుసతోంది.