ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోన్నున్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రముఖ నాయకులు గేటు దూకనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఎంపీగా ఉన్నా తనకు ప్రాధాన్యం లేదని ఒకరు భావిస్తుంటే.. జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న తన మాటకు అధిష్ఠానం కనీస విలువ ఇవ్వడం లేదని ఓ కురువృద్ధ నేత భావిస్తున్నారట!


నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు 2019 ఎన్నికలలో విజయం సాధించారు. పార్టీ ఆరంభం నుంచి దేవరాయలు పార్టీతోనే ఉన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధిపతిగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పరిచయం. నర్సారావుపేట ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత పార్టీలో లుకలుకలుకలతో ఇబ్బందులకు గురౌతున్నారు దేవరాయలు. చిలకలూరిపేట నియోజకవర్గం నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న  ప్రొటోకల్ మర్యాదలు కూడా దక్కటం లేదట. ఆ నియోజవర్గ ఎమ్మెల్యే విడదల రజనీకి, ఎంపీకి మద్య గ్యాప్ అంతకతకూ పెరుగుతుంది. తన పర్మిషన్ లేకుండా తన నియోజకవర్గంలోకి ఎంపీ ఎలావస్తారని అనేక సార్లు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి.


పార్టీ మారతారని ఉహాగానాలు
లావు కృష్ణ దేవరాయలు ఊహించింది ఒకటి జరుగుతుంది మరొకటి. గత టీడీపీ ప్రభుత్వంలో నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణకు ఇచ్చినంత ప్రాధాన్యం వైసీపీ ప్రభుత్వంలో దక్కుతుందని భావించి భంగపడ్డారు దేవరాయలు. ఎంపీ కమ్మ సామాజిక వర్దానికి చెందినవారు కావడంతో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారట. మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం కూడా ప్రయత్నించి భంగపడ్డారట. తన మాటకు పార్టీలో విలువ లేకపోవడం తీవ్రంగా బాధిస్తుందట. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళతారన్న వార్తలు లోకల్ గా హల్ చల్‌ చేస్తున్నాయి.


ఇప్పటికే టీడీపీ అధిష్ఠానంతో టచ్ లో ఎంపీ ఉన్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి రెండోసారీ విజయం సాధించిన గల్లా జయదేవ్ సైలెంట్ అయ్మారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీకూడా జయదేవ్ స్థానంలో మరో అభ్యర్థి కోసం చూస్తుందట. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కమ్మ కులానికి చెందిన వారైతే విజయం తథ్యమని టీడీపీ భావిస్తుంది. కులం కూడా తోడవటంతో వైసీపీ నుంచి టీడీపీలోకి లావు దేవరాయలు జంప్ అవుతున్నారని, గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నరన్న టాక్ అయితే వినపడుతోంది.


ఆదరించని ప్రజలు
టీడీపీ నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి లావు కృష్ణ దేవరాయలు చేతిలో రాయపాటి సాంబశివరావు ఓడిపోయారు. 2014, 2019 రెండు సార్లు నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసి ಓడిపోయారు రాయపాటి. కాంగ్రెస్ పార్టీ లో జిల్లాను శాసించిన వ్యక్తి రాయపాటి. ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టిన చరిత్ర ఆయనది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014లో టీడీపీలో జాయిన్ అయిన నుంచి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది రెండు సార్లు పోటీ చేసి ಓడిపోవడం ఒక కారణం అయితే.. వయోభరం, కొత్త తరం రాజకీయం మరో కారణం. తన బద్ద శత్రువు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి రావడం.. జిల్లా నాయకులంతా అయనతో టచ్ లోకి వెళడంతో అసలు ప్రాధాన్యం లేకుండా పోయిందని రాయపాటి భావిస్తున్నారట.


సీట్లకు గ్యారంటీ లేదని


తనకు ఎంపీ సీటు, తన కుమారుడు, కోడలకి ఎంఎల్ఏ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం అవమానంగా భావిస్తున్నారట. వైసీపీలోకి వెళ్ళేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. వైసీపీ అధిష్ఠానం వరకు తన విన్నపాన్ని పంపారట. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఒకే పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యర్థులుగా పోటీ చేసిన అ ఇద్దరూ కుండ మార్పిడి లాగా సొంత పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరేందుకు ప్రయత్నించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజకీయంగా ఆదరణ కోల్పోయిన రాజకీయ భీష్ముడు రాయపాటి సాంబశివరావు వైసీపీలోకి.. యువ ఎంపీ వైసీపీ నుంచి టీడీపీ లోకి వస్తున్నారన్న వార్తలు మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో సందడి చేస్తున్నాయి.