ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం జులై 18 నుంచి అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి మొదటి జాబితాలో ఎంపికైన కొందరు అభ్యర్థుల పేర్లు రెండో జాబితాలోనూ ఉండటంతో వాటిని సరిచేస్తూ తాజాగా అనుబంధ జాబితా విడుదలైంది. 

ఏపీలోని జిల్లా కోర్టుల్లో గతేడాది 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నియామకాల్లో భాగంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జులై 18 నుంచి 31 వరకు జరుగనుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జెస్‌ కోర్ట్స్‌ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు.

అభ్యర్థుల రెండో జాబితా అనుబంధ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఇలా..

పోస్టులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు
స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, డ్రైవర్‌      18.07.2023
జూనియర్ అసిస్టెంట్ 19.07.2023
ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్‌ 20.07.2023
రికార్డ్‌ అసిస్టెంట్‌  21.07.2023
ప్రాసెస్‌ సర్వర్  224.07.2023, 24.07.2023
ఆఫీస్‌ సబార్డినేట్‌  26.4.07.2023, 31.07.2023

ALSO READ:

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలకు నోటిఫికేషన్, అర్హతలు ఇవే!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్(01/2024) విడుదల చేసింది. అర్హత ఉన్నవారు జులై 27వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష 13 అక్టోబర్ 2023 నుంచి ప్రారంభం అవుతుంది. 
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial