Amaravti: తెలుగుదేశం పార్టీ నేత, చంద్రబాబు తనయకుడు నారా లోకేష్‌... ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు లోకేష్‌కు అపాయింట్‌మెంట్‌  ఇచ్చారు ఏపీ గవర్నర్‌. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ... గర్నవర్‌ నజీర్‌కు ఫిర్యాదు చేయనున్నారు నారా లోకేష్‌. కేసులు నమోదు  చేసిన విధానాన్ని గవర్నర్‌కు వివరించనున్నారు. దీంతో పాటు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దృష్టికి  తీసుకెళ్లనున్నారు నారా లోకేష్‌.


స్కిల్‌ స్కామ్‌ దగ్గర నుంచి ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఇసుక కేసు, పుంగనూరు, అంగళ్ల అల్లర్ల కేసులు... ఇలా ఒకదాని తర్వాత మరొకటి చంద్రబాబుపై నమోదు  చేస్తున్నారని లోకేష్‌.. గవర్నర్‌కు వివరించానున్నారు. అవన్నీ అక్రమ కేసులని... రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వేధిస్తున్నారని చెప్పనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార  వైఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ.. విపక్షాల పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు నారా లోకేష్‌. 


స్కిల్‌ స్కామ్‌లో మధ్యంతర బెయిల్‌ఫై ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌  ఇచ్చింది ఏపీ హైకోర్టు. ప్రస్తుతం చంద్రబాబు ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో... ఆయన కంటికి ఆపరేషన్‌ జరగనుంది. ఈనెల 28న సాయంత్రం 5గంటల లోపు... రాజమండ్రి జైల్‌ అధికారుల ముందు సరెండర్‌ కావాలని హైకోర్టు చంద్రబాబును ఆదేశించింది. 


ఇక.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. ఇవాళ్టి వరకు మధ్యంతర బెయిల్‌ ఉంది. నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక.. ఫైబర్‌నెట్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వాలని.. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసింది. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని కోరింది.