ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో విద్యుత్ కోతలు(Power Cuts) ప్రభుత్వాన్ని ప్రజలను చికాకు పెడుతున్నాయి. సరిపడా విద్యుత్‌ లేక కోతలు విధిస్తుంటే ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. 


ఈ పరిస్థితుల్లో విద్యుత్ శాఖ మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi Reddy Ramchandra Reddy) విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టారు. పలుమార్లు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలు అన్వేషించారు. 


కోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు కూల్‌ న్యూస్ చెప్పారు. పది రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు. 18న జరిగే విద్యుత్ సంస్థల అధికారులతో జరిగే సమావేశంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 208 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్ ఉంది. ప్రస్తుతానికి వివిధ మార్గాల్లో 182 మిలియన్ యూనిట్లే సరఫరా అవుతుందో. ఇంకా 26 మిలియన్ యూనిట్లు కొనాల్సిన పరిస్థితి వస్తోంది. 


దీనిపై ఉన్నతాధికారులతో చర్చలు జరిగిన పెద్దిరెడ్డి పదిరోజుల్లో అంతా సర్ధుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 25 నాటికి విద్యుత్ సరఫరా మరింత మెరుగు పడుతుందన్నారు. ప్రస్తుతానికి వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ మాత్రమే ఇస్తున్నామని... మే నుంచి కచ్చితంగా 9 గంటల నిరంతరాయ విద్యుత్ ఇస్తామన్నారు పెద్దిరెడ్డి. 


విద్యుత్ శాఖ మంత్రి బాధ్యత చెపట్టిన రోజునే మంత్రి పెద్ది రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ కోతలు లేకుండా ప్రయత్నాలు చేస్తామన్నారు. పవర్ హాలిడేలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.