Andhra Pradesh Assembly: వైసీపీ తీసుకొచ్చిన ల్యాండిటైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ రద్దు ప్రతిపాదనను రెవెన్యూపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ సభలోప్రవేశ పెట్టారు. దీనిపై మాట్లాడిన మంత్రి... భూమితో ప్రజలకు ఉండే అనుబంధాన్ని దూరం చేసేందుకు నియంత తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఐదేళ్లుగా చేసిన ఎన్నో ప్రభుత్వ భూములు దోచుకున్న వైసీపీ నేతలు, తర్వాత అధికారంలోకి వస్తే ప్రైవేటు భూములుకూడా లాక్కునేందుకు ఈ చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు.
ఈ బిల్లు మాట్లాడిన సీఎం చంద్రబాబు" ఇది భయంకరమైన చట్టం. ఏమాత్రం ఆలోచించకుండా చట్టాన్ని తీసుకురావడంతో చాలా సమస్యలు వచ్చాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే.. పౌరుల ఆస్తి హక్కులు మింగేసే వాళ్లు. ఇప్పటికే చాలా వరకు భూ వివాదాలు పెరిగిపోయాయి. నేను కుప్పంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఐదేళ్లలో అంతటి దారుణాలు చేశారు. 22ఏ ప్రకారం ఎవరిదైనా భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేస్తారు. తర్వాత సెటిల్ మెంట్ చేస్తారు. ఒక వేళ భూ యజమానులు వీళ్ల ఒప్పందాలకు అంగీకరిస్తే దాన్ని ప్రైవేటు భూములుగా మార్చేస్తారు. సెంటిమెంట్‌గా వస్తున్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తారు. అలాంటి భూములపై సీఎం ఫొటో వేయడం దుర్మార్గం. ప్రజల్లో ఆవేశం ఉన్నా ఏం చేయలేకపోయారు. భూ సర్వేపేరుతో డబ్బులు ఖర్చు పెట్టి వివాదాలు పెంచారు. వీటన్నింటిపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. "
"అప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై నిరనస తెలియజేస్తే కనీసం పునరాలోచిస్తామన్న మాట కూడా మాట్లాడలేదు. ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తులు లాగేసే పరిస్థితి ఉంది. భూవివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాలను సెక్షన్ 37 నిషేధిస్తుంది. అంటే నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. ఎంతమంది వెళ్లగలుగుతారు. ఈ కొత్త చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. అంటే వాళ్ల గుమస్తాలను ఇందులో పెడితే ప్రజల జాతకాలు రాస్తారు. ఎవరైనా ఈ భూమి నాది అని పెడితే ట్రైబ్యునల్‌కు వెళ్లిపోతుంది వివాదం. అంటే వివాదాలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులు లాగేయడానికి చేసిన ప్రయత్నం."
" ఈ చట్టంలో ఉన్న చెప్పిన కొన్ని సెక్షన్‌లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 ను రహస్యంగా దాచి పెట్టారు. అందుకే నేను పవన్ అన్ని సభల్లో చెప్పాం. ప్రజలు నమ్మారు. ఈచట్టం అమల్లోకి వస్తే ఆస్తులకు రక్షణ ఉండదనే ప్రజలు నమ్మారు. విదేశాల్లో ఉన్న వారి భూములు ఇక్కడ ఉన్నాయి. వాళ్లు రికార్డులు చెక్ చేసుకోకపోతే... వారి భూములు కూడా ప్రభుత్వ భూమలుగా మారిపోతాయి. అందుకే మేము ఇచ్చిన హామీ మేరకు మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెట్టాం. ఇప్పుడు సభల్లో ఆమోదించుకున్నాం. " అని చంద్రబాబు సభలో తెలియజేశారు.