Andhra Pradesh: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్రం చేపట్టే భూ సంస్కరణలు అమలు చేస్తే 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు అంగీకరించింది. భూసంస్కరణలు, భూముల రీసర్వే , రికార్డుల డిజిటలీకరణ చాలా అవసరమని గుర్తించిన కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు ఆఫర్ ప్రకటించింది. 


కేంద్రం చేపట్టే భూసంస్కరణలను ఎలాంటి షరతులు లేకుండా అమలు పరిచే రాష్ట్రాలకు ఈ సాయం అందుకుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేంద్రం తీసుకొచ్చే విధానాలు అమలు కావాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందుతాయని పేర్కొన్నారు. 


గ్రామాల్లో యునిక్‌ ల్యాండ్ పార్సిల్ ఐటెంటిఫికేషన్ నెంబర్ అంేట యూఎల్‌పిన్‌ కేటాయించాలని సూచించారు నిర్మలాసీతారామన్, భూ ఆధార్ కూడా ఉండాలని స్పష్టం చేశారు. సర్వే సబ్‌ డివిజన్లు జరగాలని చెబుతూనే భూ యజమాన్యాన్ని నిర్దారించే సర్వే చేపట్టాలన్నారు. ల్యాండ్ రిజిస్టర్లు కూడా రూపొందించాలని పేర్కొన్నారు. వాటికి రైతుల రిజిస్టర్లకు లింక్ చేయాలని వివరించారు.  



పట్టణాల్లో కూడా ల్యాండ్ సర్వే చేసే రికార్డులను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా డిజిటలైజేషన్ చేసేలాచొరవ తీసుకున్న రాష్ట్రాలకు వడ్డిలేని రుణాలు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వస్తుందని తెలిపారు. ఈ ల్యాండ్ సర్వే విషయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేగింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల హక్కులను కాలరాసేలా ఉందని కూటమి ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసింది. దీనికిసంబందించిన తీర్మానాన్ని కూడా మంగళవారం సభ ఆమోదించింది. 


Also Read: లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం - ప్రజల నుంచి సానుభూతి కోసమేనా ?


రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించారని వైసీపీ ఆరోపిస్తోంది. అప్పటి జగన్ తీసుకున్న నిర్ణయాలనే నేడు కేంద్రం సభలో ప్రస్తావించిందని సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేస్తోంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను భూతంలా చూపించి ఎన్నికల్లో లబ్ధిపొందారని ఆరోపిస్తోంది. దేశంలో ఎక్కడా జరగని విధంగా భూములు రీ సర్వే చేశామని అదే ఇప్పుడు కేంద్రం కూడా చేయాలని చెబుతోందన్నారు. 






కేంద్రం ఇప్పుడు చెబుతున్న భూ రికార్డుల డిజిటలైజేషన్‌ ఎప్పుడో జగన్ సర్కారు చేసి చూపించిందని గుర్తు చేస్తున్నారు. ఆరు వేల గ్రామాల్లో ఈ భూముల రీ సర్వే విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొంటోంది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి చేపట్టిన ఈ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కానీ కూటమి ప్రభుత్వం రాజకీయ స్వార్థంతో అన్నింటినీ రద్దు చేసి ప్రజలకు తీరని అన్యాయం చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. 


Also Read: రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉంది: బీజేపీ ఎంపీలు