అందరు అనుకున్నట్లే జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను నియమించారు. ఈ నియామకం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబును ఓడించాలన్న లక్ష్యంతో కన్నా నియామకం జరిగిందని వార్తలు అయితే షికారు చేస్తున్నాయి. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి అడ్డగోలుగా విమర్శిస్తున్న అంబటికి చెక్ పెట్టేందుకు సర్వం సిద్దం చేసినట్లు కనబడుతుంది.


పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. 2014లో  అంబటి రాంబాబును ఓడించి కోడెల శివప్రసాద్ ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. విభజిత రాష్ట్రానికి మెదటి స్పీకర్ గా పనిచేశారు. 2019 లో కోడెలపై విజయం సాధించారు అంబటి. ఆ తర్వాత కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆనాటి నుంచి టీడీపీ ఇంచార్జ్ పదవి కోసం కోడెల కుమారుడు శివరాం, మాజీ ఎంఎల్ఏ వైవీ ఆంజనేయులు, మల్లి ప్రదానంగా పోటీలో ఉన్నారు.


సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి  అంబటి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. గెలుపొందిన నాటి నుంచి పార్టీ అధిష్టానం ఆదేశాలతో ప్రధానంగా జనసేనాని‌ పవన్ కళ్యాణ్ ను  టార్గెట్ చేసారు అంబటి. పవన్ కళ్యాణ్ తో‌ పాటుగా కాపు కులాన్ని కించ పరిచే విధంగా పలు మార్లు మాట్లాడటం ‌సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. సందర్బం ఉన్నా లేక పోయినా చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.‌‌ఈ నేపథ్యం టీడీపీ, జనసేన పార్టీలు అంబటిని టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితులలో రాబోయో ఎన్నికలలో అంబటిని ఓడించేందుకు పావులు కదుపుతున్నారని రూమర్ హల్ చల్‌ చేసింది. కొన్ని కారణాల వల్ల బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు కన్నా లక్ష్మీ నారాయణ. కాపు సామాజిక వర్గంలో ప్రాధాన్యం గల నాయకుడిగా గుర్తింపు  ఉంది. కాపు సామాజిక వర్గంపై కొంత వరకు ప్రభావం కన్నా చూపగలుగుతారని చంద్రబాబు నమ్మకంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.


కన్నా టీడీపీలో జాయిన్ అయిన తర్వాత గుంటూరు పశ్చిమ, లేదా పెదకూరపాడు నుంచి‌ పోటీ చేస్తారని వార్తలైతే వచ్చాయి. అనుహ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో‌ పొలిటికల్ హీట్ ను పెంచింది.


ప్రజలలో‌ మద్దతు కూడగట్టే ప్రయత్నం


సత్తెనపల్లి నియోజకవర్గంలో కమ్మ వర్గం 30 వేలు, కాపులు 35 వేలు ఓటింగ్ ఉన్నారు. రాజుపాలెం మండలం కన్నాకు పూర్తి ఫేవర్, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న మైనార్టీ వర్గం కన్నాతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గం అంబటికి దూరంగా ఉందట. వారు కన్నాపై  పూర్తి  ఆసంతృప్తితో ఉన్నారట. అన్ని రకాలుగా బేరీజు వేసుకున్న తర్వాతే  కన్నాను ఇంచార్జ్ గా నియమించుకున్నట్లు సమాచారం.


ఎప్పుడూ వచ్చారన్నది ముఖ్యం, కాదు బుల్లెట్ దింపటమే ప్రధానం.
దెబ్బ కొడితే తిరిగి లేవకూడదు అన్న సూత్రం టీడీపీ, జనసేన పార్టీ గట్టిగా ఫాలో అవుతున్నాయి. విలువలకు తిలోదకాలు ఇచ్చి ఒక పార్టీకి అద్యక్షుడు అన్న కనీసమ గౌరవం లేకుండా రంకెలు వేస్తూ అసభ్యంగా మాట్లాడం, ఆ పార్టీల క్యాడర్ కూడా జీర్ణంచుకోలేకపోతుంది. గట్టిగా అంబటికి బుద్ధి చెప్పేందుకు క్యాడర్ కూడా సిద్దమయ్యాయట.


వస్తాద్ వచ్చాడు.


నిన్న మంగళవారం సత్తెనపల్లిలో జరిగిన వైసీపీ బీసీ‌ సమావేశంలో అంబటి మాట్లాడుతూ తనను ఓడించేందుకు ప్రతిపక్షం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. పోటీ పడుతున్న నలుగురిని కాకుండా బయట నుంచి మరో వస్తాదును టీడీపీ తీసుకొస్తుందని ఆన్నారు. 24  గంటలు గడవక ముందే ఆ వస్తాద్ ను ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో మిగతా నాయకులతో పోల్చుకుంటే అన్ని రకాలుగా ముందంజలో ఉంది మాత్రం కన్నా లక్షనారాయణే.
అంబటి పైకి పోటీగా వస్తాద్ కన్నా లక్ష్మీనారాయణను రంగంలోకి దింపింది టీడీపీ. కన్నాపై విజయం సాధించండం అంబటికి కష్టతరమే అంటున్నారు స్థానికులు. అతిగా మాట్లాడి ఆప్తులను సహితం దూరం చేసుకోవడం అంబటి నైజం. మృదు సంభాషణలతో శతృవుని సహితం మిత్రుడిగా చేసుకొనే తత్వం కన్నాకి సొంతం. చూడాలి మరి సత్తెనపల్లిలో మళ్లీ పోటీ చేసేందుకు అంబటికి అవకాశం ఇస్తారా లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తారో. అంబటి ప్రత్యర్థి అయితే కన్నా పరిస్థితి నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయ పడుతున్నారు.