Amaravathi : ఐదేళ్లుగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు,ముళ్ల కంపలను తొలగించే పనుల్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . ముఖ్యమంత్రి పర్యటన సమయంలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన ఎత్తైన భవనాలు సైతం అడవి మధ్యలో ఉన్నట్లు కనిపించాయి..ఈ పరిస్థితి నుంచి ముందుగా అమరావతిని పూర్తిగా బయటకు తీసుకొచ్చేలా కంపలు,తుమ్మచెట్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. దీంతో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 36. 5 కోట్ల రూపాయల వ్యయంతో తో నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్( సంస్థ ఈ పనులను ప్రారంభించింది.
24వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు
అమరావతిలోని ఎన్ 9 రహదారిని ఆనుకొని ప్రస్తుత సచివాలయం ఉన్న వెనుకవైపు జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు..స్థానిక ఎమ్మల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ తో కలిసిప్రత్యేక పూజలు అనంతరం స్వయంగా పొక్లెయిన్ ను ఆపరేట్ చేసి పనులను ప్రారంభించారు మంత్రి నారాయణ.. 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో అమరావతి కోసం కేవలం 38 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు..ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించిన భూమిలో మాస్టర్ ప్లాన్ ద్వారా రోడ్లు,భవనాలు,ఇతర మౌళిక వసతులు కల్పించేందుకు 41,484 కోట్లతో పనులు చేపట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు..అయితే గత వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి విశాఖపట్నం,కర్నూలు,అమరావతి అంటూ రైతులను ఇబ్బంది పెట్టింది...గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎంతో ధైర్యంతో ఉన్న అమరావతి రైతులను అభినందిస్తు్నట్లు మంత్రి తెలిపారు.మొత్తం 58 వేల ఎకరాలు అమరావతి పరిధిలో ఉండగా 24 వేల ఎకరాల్లో దట్టమైన అడవిలా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయన్నారు .
నెల రోజుల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లు
వెంటనే కంపలు తొలగించాలన్న సీఎం ఆదేశాలతో పనులు ప్రారంభించామన్నారు మంత్రి...30 రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసామన్నారు...అమరావతి పనులకు ఇది మొదటి అడుగు అన్నారు...జంగిల్ క్లియరెన్స్ పూర్తయితే రైతులు తమకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్ లు ఎక్కడ ఉన్నాయో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు...అమరావతి కి జరిగిన అన్యాయంతో రైతులు ఇబ్బందులను గుర్తించి వారికి మరో ఐదేళ్ల పాటు కౌలు గడువు పొడిగించామన్నారు మంత్రి.భూమి లేని నిరుపేదలకు కూడా మరో ఐదేళ్లు పెన్షన్ కొనసాగించేలా నిర్నయం తీసుకున్నామన్నారు..అమరావతి నిర్మాణం ద్వారా రైతుల భూముల విలువ పెరిగేలా చేస్తామని చెప్పారు మంత్రి నారాయణ.
త్వరలో ఐఐటీ నిపుణుల ప్రాథమిక నివేదిక
గడిచిన ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాటి సామర్ధ్యంపై అధ్యయనం చేస్తున్నామన్నారు మంత్రి..ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్,ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్ నిపుణులు అమరావతిలో పర్యటించి గతంలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు..త్వరలో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందిస్తారని...దానికనుగుణంగా నిర్మాణాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు.