Amaravati News: వారం రోజులుగా రాశేఖర్ రెడ్డి బిడ్డలు జగన్, షర్మిల మధ్య నెలకొన్న ఆస్తి తాగాదాలు తెలుగు రాష్ట్రాల్లోనే హాట్‌టాపిక్‌గా మారాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒకవైపు షర్మిల అన్న జగన్‌పై విమర్శలు చేస్తుంటే... వైసీపీ నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకంగా జగన్ అండ్‌ కో ఆరోపణలు చేస్తోంది. 


ఈ వివాదంపై వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ఆస్తుల కోసం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫ్యామిలీ రోడ్డున పడటం బాధగా ఉందన్నారు. పరిణామాలు చూస్తున్న రాజశేఖర్ రెడ్డి అభిమానిగా చాలా బాధపడుతున్నాను అన్నారు. 



40 ఏళ్లుగా హుందాగా రాజకీయం చేసిన రాశేఖర్‌రెడ్డి జీవితాన్ని జగన్, షర్మిల బజారున పడేశారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. రాశేఖర్ రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతో రాజకీయాల్లో రాణిస్తున్న తన లాంటి వారందరూ ఇదే భావనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. వీళ్లు ఇద్దరి కారణంగా రాజశేఖర్‌రెడ్డిపై ఎవరు పడితే వాళ్లు నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కనీసం ఆయన పేరు పలికే అర్హత లేని వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. 


విజయమ్మ ప్రోత్సాహంతో తను, వైవీ సుబ్బారెడ్డి రాజకీయాల్లో వచ్చామన్నారు బాలినేని. అయితే షర్మిల, విజయమ్మపై విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిగా కన్నీళ్లు పెట్టుకొని షర్మిల అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. తన బిడ్డలపై ఒట్టు వేసేందుకు షర్మిల రెడీ అయ్యారని... సుబ్బారెడ్డి నుంచి స్పందన రాలేదన్నారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న వార్‌లో విజయమ్మ నలిగిపోతున్నారని అన్నారు. 



అన్నాచెల్లెల్ల వివాదంలో ఎవరూ మాట్లాడటానికి అర్హత లేదన్నారు బాలినేని. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి విజయమ్మే పెద్దని ఆమె మాత్రమే మాట్లాడాలని సూచించారు. ఆమె ఈ సమస్యలను పరిష్కరిస్తారని అభిప్రాయపడ్డారు. షేర్లులో గోల్ మాల్ జరిగితే కొడుకు జైలుకు వెళ్తాడని తల్లికి తెలియదా అని ప్రశ్నించారు. అలా కుమారుడిని జైలుకు పంపించే నిర్ణయం తల్లి ఎందుకు తీసుకుంటుందని నిలదీశారు. 


తల్లి విజయమ్మకు ఏదైనా తప్పు జరిగి ఉంటే... జగన్ ఒక్క మాట చెప్పి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు బాలినేని. మాట్లాడుకోవడం మానేసి ఇలా రచ్చ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అంతే కాకుండా దీనికి చంద్రబాబు కారణమంటూ సాకులు ఎందుకని నిలదీశారు. ఇందులో చంద్రబాబు ప్రమేయం లేదని... లేఖలు రాసుకొని రోడ్డుపైకి వచ్చేందీ మీరిద్దరని గుర్తు చేశారు. ఇందులో చంద్రబాబుకు ఏం సంబంధం, పవన్‌కు ఏం సంబంధం, కూటమికి ఏం పని అని క్వశ్చన్ చేశారు. 


ఇప్పటి వరకు జరిగిందాని గురించి మర్చిపోయి ఇప్పుడు ఫైనల్‌ నిర్ణయం విజయమ్మకు వదిలేయాలని తెలిపారు బాలినేని. ఇప్పుడు ఈ వివాదానికి జడ్జి విజయమ్మే అన్నారు. ఎవరు తప్పో ఎవరు ఒప్పో ఆమె పరిష్కరిస్తారు అన్నారు. వాళ్లు పోట్లాడుకొని కూటమికి అంటగట్టం భావ్యం కాదన్నారు. విజయమ్మ ఒకట్రెండు రోజుల్లో కలుగుజేసుకొని సమస్యకు తొందరగా పరిష్కారం చేయలి కోరుకుంటున్నట్టు విజ్ఞప్తి చేశారు.


 


తాను వేరే పార్టీ వ్యక్తిగా ఉన్నా సరే రాజకీయ భిక్ష పెట్టి రాజశేఖర్ రెడ్డి కుటుంబం బాగుండాలని కోరుకుంటానన్నారు బాలినేని. ఆడపిల్ల కన్నీళ్లు మంచివి కావన్న బాలినేని... త్వరగా వివాదం పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. తల్లికి కుమార్తె, కుమారుడు మధ్య ఎక్కువ తక్కువ ఉండదని ఆమె చెప్పే పరిష్కారానికి అంగీకరించాలని సూచించారు. ఒకట్రెండ రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఆకాంక్షించారు. 


Also Read: షర్మిలతో ఆస్తుల తగాదాపై వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయం- వివాదం ముగిస్తున్నట్టు ట్వీట్