Nara Lokesh Met With Tesla representatives: అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ మినిస్టర్ లోకేష్‌ టెస్లా ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల నుంచి అమెరికాలో ఉన్న నారా లోకేష్‌ పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వ్యాపార అనుకూలతను వివరిస్తున్నారు. 


ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌ ఈ నెల 25న అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ టూర్‌లో భాగంగా ఆదివారం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటికే కియాలాంటి సంస్థ విజయవంతంగా రన్ అవుతుందని వాళ్లకు వివరించారు. బిజినెస్ పెంచుకుంటున్న ఆ సంస్థ ఏటా విస్తరిస్తోందని తెలిపారు. ఇప్పుడు ఈవీలకు ఏపీ మంచి హబ్‌గా మార్చాలని సంకల్పించామని వారికి వివరించారు. 


అనంతపురం జిల్లా ఎలక్ట్రికల్ వెహికల్స్‌కు మంచి అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈవీ రిలేటెడ్ పరిశ్రమలు పెట్టుకోవచ్చని కూడా తెలిపారు. ఏపీ ప్రగతి కోసం మంచి పారిశ్రామిక విధానం కూడా తీసుకొచ్చామని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


టూర్‌లో భాగంగా ఆదివారం టెస్లా ప్రతినిధులతో కూడా నారా లోకేష్‌ సమావేశమయ్యారు. సీఎఫ్‌వో వైభవ్‌ తనేజాతో లోకేశ్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రావాలని ఆహ్వానించారు. టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు.


అంతకు ముందు రోజు శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రాప్ బాక్స్‌కో ఫౌండర్ సుజయ్ జస్వా నివాసంలో పారిశ్రామికవేత్తలతో లోకేష్‌ సమావేశమయ్యారు. అమరావతి పరిసరాల్లో ప్రభుత్వరంగంలో 3బిలియన్ డాలర్లు, ప్రైవేటు రంగంలో 4.5బిలియన్ డాలర్లతో వివిధ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు. మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో పూర్తికానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని వెల్లడించరు. అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎఐ సంస్థలకు అవరమైన మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటుందని కూడా వారికి తెలియజేశారు. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశాను.


ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను ఆవిష్కరించాను. అనంతరం బోసన్ సంస్థ ఆఫీస్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ లో సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్‌వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్ వివరించారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ డెమోను ప్రదర్శించారు. ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు తమసంస్థ సిరిస్ ఎ స్టార్టప్‌లతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలు వివరించారు. సంస్థ డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతకు సంబంధించి సురక్షితమైన ఆన్‌లైన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తుందని చెప్పారు డిజిసెర్ట్ సిఇఓ అమిత్ సిన్హా . ఈ సందర్భంగా వారితో మాట్లాడి లోకేష్‌ సంస్థల అనుబంధ యూనిట్లు ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. సరైన ప్రతిపాదనలతో వస్తే సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతుల మంజూరు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు.