Earthquake in Prakasam District | ఒంగోలు: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం అర్ధరాత్రి 12.47గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణ భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మే నెలలోనూ ఏపీలో పలుమార్లు భూకంపం సంభవించింది.
Earthquake in Prakasam: ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి భూకంపం, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Shankar Dukanam | 09 Jun 2025 09:49 AM (IST)
Andhra Pradesh News | ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు అర్ధరాత్రి ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి భూకంపం, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు