CRDA building in Amaravati to be inaugurated on the 13th: అమరావతిలో ఏపీ సీఆర్‌డీఏ శాశ్వత ప్రధాన కార్యాలయం అక్టోబర్ పదమూడో తేదీన ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అక్టోబర్ 13న ప్రారంభించనున్నారు. రాయపూడి ప్రాంతంలో 3.62 ఎకరాల్లో నిర్మితమైన ఈ 7 అంతస్తుల భవనం, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌తో పాటు అధునాతన సౌకర్యాలతో అమరావతి అభివృద్ధికి కేంద్ర హబ్‌గా మారనుంది. 

రాయపూడి ప్రాంతంలో 3.62 ఎకరాల స్థలంలో నిర్మితమైన ఈ భవనం, మొత్తం 2.42 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. భవనం G+7 (గ్రౌండ్ + 7 అంతస్తులు) రూపంలో ఉంది, అంటే మొత్తం 8 అంతస్తులు. ప్రతి అంతస్తులో అధికారుల కెబిన్‌లు, ఉద్యోగుల వర్క్‌స్టేషన్‌లు, కామన్ ఫెసిలిటీలు అలాగే విస్తృత ఇంటీరియర్ డిజైన్‌తో ప్రణాళికాబద్ధంగా నిర్మించారు.  అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులను రియల్-టైమ్‌లో మానిటర్ చేయడానికి అధునాతన కమాండ్ సెంటర్. ఇది సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ (CDMA) వంటి విభాగాలకు కోఆర్డినేషన్ ప్లాట్‌ఫాంగా ఉపయోగపడుతుంది. 

 ఎలక్ట్రికల్ ఫిటింగ్స్, ఇంటీరియర్ వర్క్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, మోడరన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పని చేసే వాతావరణాన్ని సిద్ధం చేశారు.  మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పొంగురు నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ కెబిన్‌లు. అన్ని మున్సిపల్ మరియు HoD (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్) ఆఫీసులు  ఈ కార్యాలయంలో ఉంటాయి. ఈ భవనం అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్ధికి కేంద్ర యూనిట్‌గా పనిచేస్తుంది.  

2014లో మొదలైన ఈ ప్రాజెక్ట్ 2019 వరకు 50% పూర్తి అయింది, కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నిలిపివేశారు.  2024లో మళ్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత ఇచ్చి వేగవంతం చేశారు.  అక్టోబర్ 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభం తర్వాత, సీఆర్‌డీఏ, ADCL, CDMA వంటి విభాగాలు, మున్సిపల్ ఆఫీసులు, HoDలు ఈ భవనానికి  మారుస్తారు.   ప్రస్తుతం విజయవాడ లెనిన్ సెంటర్‌లో ఉన్న సీఆర్‌డీఏ తాత్కాలిక కార్యాలయాన్ని MEPMAకు అప్పగించనున్నారు.