Andhra Pradesh News: మరో తొమ్మిది ప్రశ్నలతో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా రోజుకో 9 ప్రశ్నలతో అన్నయ్య జగన్‌కు లెటర్స్ రాస్తున్నారు. ఇవాళ(7 మే 2024) రాజధాని, ఇతర మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీలపై ప్రశ్నలు సంధించారు. 
జగన్‌కు షర్మిల సంధించిన ప్రశ్నలు ఏంటంటే....


1) స్మార్ట్ సిటి, హెరిటేజ్ సిటీగా కేంద్రం గుర్తించిన రాజధాని అమరావతిని మూడు రాజధానుల వాదనతో ఎందుకు విధ్వంసం చేశారు.? పోనీ విశాఖలో అయినా మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదు? కర్నూలులో ఏం నిర్మాణాలు జరిపారు?


2) రాష్ట్ర విభజన టైంలో రెవెన్యూ రాబడులు తెలంగాణకు 51 వేల కోట్లు, ఏపికి 65 వేల కోట్లు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ రాబడులు 1.59లక్షల కోట్లకు పెరిగాయి. ఏపి 1.58లక్షల కోట్ల మధ్య ఉన్న వాస్తవాన్ని కాదనగలరా ?


3) రాష్ట్రంలో 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన ఎందుకు చేయలేదు ?


4) ఐటీ రంగాన్ని పూర్తిగా ఎందుకు నిర్లక్ష్యం చేశారు ? ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 1.81 లక్షల కోట్లు సాధిస్తే ఏపీ కేవలం 962 కోట్లా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 


5) విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగినా అమలు కాలేదు అంటే మీరు భూ కేటాయింపు చేయలేదు. దీనికి నైతిక బాధ్యత మీది కాదా?


6) పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం కక్ష్య, నిర్లక్ష్యంతో వదిలేసిన మాట వాస్తవం కాదా ?


7) కనిగిరి, ఏర్పేడులో నిమ్జ్ అనుమతులు వస్తే 25 వేల ఎకరాల భూ కేటాయింపులు జరపని మాట వాస్తవం కాదా ?


8) విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు?


9) వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా మీరు ఏం చేశారు ? కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేక పోయారు ? అంటూ తొమ్మిది ప్రశ్నలతో లేఖ రాశారు.