ఉద్యోగుల ఉద్యమ చరిత్రలో తాము సాధించింది చారిత్రాత్మక విజయమని అమరావతి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అందుకే ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ముందుకు వచ్ఛిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్  పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ ఛైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సీఎస్ కు ఫిబ్రవరి 9 న ఇచ్చిన 48 డిమాండ్లతో మెమోరండం ఇస్తే అందులో 37 డిమాండ్లు ఈ 92 రోజుల ఉద్యమం ద్వారా సాధించుకున్నామని వారు పేర్కొన్నారు.


ఇంకా మిగిలి ఉన్న 11 డిమాండ్లను కూడా సాధించుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. 92 రోజుల ఉద్యమకాలంలో అనేక శాఖల్లో పనిచేసే చిరు ఉద్యోగులు, మునిసిపల్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులలో అనేక బాధలు గమనించామని, వాటిని విని, భవిష్యత్ లో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రధానంగా కొన్ని శాఖల్లో, వివిధ స్కీంల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం పొందక, సకాలంలో జీతాలు రాక, కనీస రాయితీలు లేక పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.


ఉద్యోగులంతా కలసి రావాలి
ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యాలను ఈ సందర్బంగా  ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్  పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు వెల్లడించారు. శాఖాపరమైన సంఘాల సమస్యలు పరిష్కరించుకనేందుకు కలిసి రావాలని, మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని ప్రతి సందర్భంలో గొంతెత్తి మాట్లాడింది, ప్రత్యేకంగా వారి కోసం ఒక రోజు ధర్నా నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమేనని అన్నారు.


గ్రామ వార్డ్ సచివాలయంలోని ప్రతి ఉద్యోగి సమస్యలను బయటకు తీసుకువచ్చి, వారి కోసం ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు గతంలో కలిసి పనిచేసిన ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను దఫదఫాలు ఆహ్వానించినప్పటికీ ఎవరూ కలిసిరాలేదని అన్నారు. ఆ కారణంగా ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలుగా ఉన్న 96 డిపార్ట్మెంట్‌ సంఘాల మద్దతుతో ఉద్యోగుల పక్షాన పోరాడాలని ఫిబ్రవరి 5 న కర్నూలులో జరిగిన సమావేశంలో  నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 న 50 పేజీల మెమోరాండంలో 48 డిమాండ్లతో కూడిన ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కి ఇవ్వడం జరిగిందన్నారు.


ఈ డిమాండ్లు సాధన కోసం మార్చ్ 9 నుండి  92 రోజుల పాటు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన మూడు దశల ఉద్యమ కార్యాచరణతో 48 డిమాండ్లులలో 37 సాధించుకున్నామని, ఇది ఉద్యోగుల విజయంగా అభివర్ణించారు. 92 రోజుల ఏపీజేఏసీ అమరావతి ఉద్యమం ద్వారా సాధించుకున్న విజయాలను గురించి ఈ సందర్బంగా వెల్లడించారు.


1. అందరి ఉద్యోగులకు GPF/ Apgli/ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పోలీస్ శాఖ  వారికి T.A బిల్లులకి సంబంధించి రు.3600 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయటం 
2. RTC లో  పదోన్నతులు పొందిన 2096 మందికి PRC వర్తింపజేయటం
3. RTC ఉద్యోగులకు OTS సాధించటం
4. జీతం/ పెన్షన్ రూపేణా నెలకు రు.10,000/-సంపాదనపరులకు రైస్ కార్డు,ఇతర సౌకర్యాలు కల్పించడం (FCS01-FCCSOCSS ( MISC ) 29/2021-CS-I)
5. టైపింగ్ క్వాలిఫికేషన్ రద్దు చెయ్యడానికి అంగీకరించారు.
6. కారుణ్య నియమకాలు చేపట్టడం (1158 మంది RTC నందు మరియు ఇతర శాఖలలో)
7. 1/2022 సంబంధించిన DA విడుదల చెయుట. ( GO MS No 66 Fin(PC-TA) Dept,Dt:11.05.2023)
8. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ( అన్ని HODల నుండి డేటా అభ్యర్థించబడినది)
9. GSWS ఉద్యోగులకు టార్గెట్స్ రద్దుచేయటం. ( Circular No ROC No.185/F/GSWS/2023,Dt: 03-05-2023)
10. 10% CPS ఉద్యోగుల వాటా ఐన 2443 కోట్లు PRAN అకౌంటులో జమచేయడం.
11. కొత్తగా ఏర్పిడిన జిల్లా కేంద్ర కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 16 %  HRA వర్తింపచేయటం. (GO MS No 69 Fin(PC-TA) Dept,Dt:09.05.2023)