AP Latest News: ఏపీ సంచలనం రేపుతున్న మహిళ గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడం పట్ల వివాదాలు రేగుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ ట్రోలింగ్ ను తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆమె ప్రాణాలు తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లుగా సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారాన్ని సీఎంవో ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు.


సీఎంవో తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని సీఎం అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని, గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు’’ అని ఏపీ సీఎంవో ఓ ప్రకటన విడదల చేసింది.


మంత్రి రోజా స్పందన
మహిళలు అందరూ బాధపడే విధంగా మహిళ గీతాంజలి ప్రాణాలు తీసుకుందని రోజా అన్నారు. ఆమె తవ జీవితాన్ని చాలించిందని అన్నారు. గీతాంజ‌లి మృతికి కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. మంగళవారం (మార్చి 12) రోజా తిరుమ‌ల వెంక‌టేశ్వర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. గీతాంజలి మరణం బాధాకరమని అన్నారు. గీతాంజలి మృతి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తిరుమల శ్రీవారిని ప్రార్దించానని అన్నారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా చూపించడమే గీతాంజలి చేసిన తప్పు పనా అని ప్రశ్నించారు.