అమరావతి భూముల కేసులో మరో ట్విస్టు. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ప్రభుత్వం తన పిటిష్ ఉపసంహరించుకుంది. అమరావతి భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తరఫున లాయర్ వివరించారు. ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. 


ALSO READ: అమ్మో.. ఒకటో తేదీ..! ఈసారి జీతాలు ఎప్పటికో..?


అమరావతి ఏరియాలో రాజధాని వస్తుందన్న ముందస్తు సమాచారంతో ఇక్కడ భూములు కొనుకున్నారని కేస్ ఫైల్ అయింది. అడ్వకేట్ జనరల్ పోస్టులో ఉండి ఆ ప్రాంతంలో భూములు కొన్నారని ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు... ఏసీబీ విచారణపై గాగ్ ఆర్డర్ ఇష్యూ చేసింది. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 


ALSO READ: తాడేపల్లి కాలనీని కూల్చివేత వెనుక "ఆ" ప్లాన్..!?



హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై స్టే ఇవ్వాలని గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం తన పిటిషన్ ఉపసంహరించుకుంది. హైకోర్టులో పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని.. దానిపై కౌంటర్ వేయనున్నట్టు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. అందుకే నవంబర్‌లో గ్యాగ్ పిటిషన్‌ కొట్టేయాలని వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు వివరించింది ఏపీ ప్రభుత్వం. 


ALSO READ:రాజ్యసభలో పెగాస‌స్ స్పైవేర్ దుమారం... టీఎంసీ ఎంపీలపై చర్యలు...


ఈ మధ్యే సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందన్న వాదనను కొట్టిపారేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే విషయంపై క్లారిటీ లేదని తేల్చేసింది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. 


ALSO READ: అమరావతి ఇక అంతా స్వచ్ఛమేనా..!?


ఈ ఇష్యూలో విచారణ త్వరగా ముగించాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని సూచించింది. 


ALSO READ: ఏపీ సెట్ ఎగ్జామ్స్ తేదీలివే..