ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్దేశిత సమయం కంటే 15 నుంచి 20 రోజుల ముందుగానే జరుగుతాయని అన్నారు. నేడు (డిసెంబర్ 15) జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ మంత్రులతో ఈ వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. కాబట్టి, ఎన్నికలకు అందరూ పూర్తిగా రెడీగా ఉండాలని అన్నట్లు తెలిసింది.
మన పార్టీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉందని, అయినప్పటికీ మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థంగా పని చేయాలని సీఎం నిర్దేశించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని సీఎం అన్నారు.