IIM Visakhapatnam EMBA Admissions: విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు (Working Professionals) ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జనవరి 27లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2,950 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్హత మార్కులు, పని అనుభవం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు సీటు కేటాయిస్తారు. సీట్లు పొందినవారికి 2024 మే 26 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. కోర్సు 2026 ఏప్రిల్ వరకు కొనసాగనుంది. కోర్సు ఫీజును రెండేళ్ల కాలానికి రూ.10.8 లక్షలుగా నిర్ణయించారు.
వివరాలు..
* ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈఎంబీఏ) ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్
ప్రోగ్రామ్ వ్యవధి: రెండేళ్లు.
క్రెడిట్లు ఇలా..
మొత్తం రెండేళ్ల కోర్సుకు సంబంధించి 74 క్రెడిట్లు ఉంటాయి. ఇందులో మొదటి సంవత్సరంలో 36 క్రెడిట్లు (టర్మ్-1కు 12 క్రెడిట్లు, టర్మ్-2కు 12 క్రెడిట్లు, టర్మ్-3కి 12 క్రెడిట్లు) నిర్ణయించారు. ఇక రెండో సంవత్సరంలో 38 క్రెడిట్లు (టర్మ్-4కు 12 క్రెడిట్లు, టర్మ్-5కు 12 క్రెడిట్లు, టర్మ్-6కి 14 క్రెడిట్లు) నిర్ణయించారు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉండాలి. ఆఫీసర్/ ఎగ్జిక్యూటివ్ లేదా అంతకంటే పైస్థాయి ప్రొఫెషనల్/ ఎంట్రప్రెన్యూర్‌గా కనీసం మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: వయోపరిమితి నిబంధనలు లేవు.
ప్రవేశ ప్రమాణాలు: విద్యార్హత మార్కులు, పని అనుభవం, ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.2,950.
ట్యూషన్ ఫీజు: రూ.10,80,000.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.01.2024.
➥ ప్రవేశ పరీక్ష తేదీ: 03.02.2024.
➥ ఇంటర్వ్యూ తేదీ: 04.02.2024.
➥ ఫలితాల వెల్లడి: 12.02.2024.
➥ కోర్సు ప్రారంభం: 26.05.2024.
ALSO READ:
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024, ముఖ్యమైన తేదీలివే
వైమానిక కోర్సుల్లో ప్రవేశాలకు ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా మరియు సర్టిఫికేషన్ కోర్సులు వంటి అనేక ఏవియేషన్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సును అనుసరించి సంబంధిత గ్రూపులో 10వ తరగతి &12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు 'నిఫ్ట్-2024' నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా
దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT), క్యాంపస్‌లలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించే ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. యూజీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి..