Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు పదవీ  స్వీకారం చేశారు. సచివాలంయోలని నాల్గో బ్లాకులో తనకు కేటాయించిన ఆఫీస్‌లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కాలువలు, డ్రైన్లలో గుర్రపు డెక్కు, తూడు తొలగించే పనుల ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పోలవరం ప్రాజెక్టుపై వైట్‌పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. 




ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడిగా పిలిచే పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అస్తవ్యస్థం చేసిందని ఆరోపించారు రామానాయుడు. ఏడాదిలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. ప్రాజెక్టు కోసం కేంద్రం రిలీజ్ చేసిన నిధులను కూడా వేరే పనులకు ఉపయోగించారని తెలిపారు. 2014 నుంచి ఏం జరిగింది జగన్ పాలనలో ఏం చేశారో అన్నింటినీ స్టడీ చేసి త్వరలోనే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్ర రిలీజ్ చేస్తామన్నారు.  




కొట్టుకుపోయిన ప్రధాన విభాగాలు సరిదిద్ది ప్రాజెక్టును ఒక రూపు తీసుకొచ్చేందుకు కాస్త సమయం పడుతుందన్నారు నిమ్మల. ఖర్చు కూడా అదే స్థాయిలో అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అన్నింటినీ పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాల తీసుకుంటామని ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. 




పోలవరం ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు జలవనరుల శాఖ మంత్రి. వాటితోపాటు రాష్ట్రంలోని రైతులకు మేలు జరిగేలా ఏటిగట్లు బలోపేతం చేయడం, ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టు గేట్ల, షటర్లు రిపేర్ చేయాలని... ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వాటికి కనీసం గ్రీజు కూడా పూయలేదని ఆరోపించారు.