Andhra Pradesh : ప్రజలకు సేవ చేయాలనే తపనకు వంద శాతం అండగా నిలిచిన నా సర్వస్వానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా భార్యకు పుట్టిన రోజు విషెష్ చెప్పారు. చంద్రబాబు ఏం రాశారంటే..." ఎప్పుడూ నాకు బలంగా మద్దతు తెలిపే, కష్టకాలంలో కూడా నవ్వుతూ... ప్రజాసేవ చేయాలనే నా ఆకాంక్షకు వంద శాతం అండగా ఉండే భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు. నీవే నా సర్వస్వం." అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.
చంద్రబాబు చేసిన ట్వీట్‌పై భువనేశ్వరి కూడా అంతే లవ్లీగా స్పందించారు" థాంక్యూ అండీ, ప్రతి రోజు మరింత బెటర్ అవ్వడానికి మీరే స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్‌లో పిలుచుకునే మన పెద్ద ఫ్యామిలీపై మీకు ఉన్న ప్రేమకు నేను గర్విస్తున్నాను. నేను ఎప్పుడూ మీకు మద్దతు ఇస్తూ తోడుగా ఉంటాను. మీరే నా సర్వస్వం. " అంటూ చంద్రబాబు ట్వీట్‌పై రియాక్ట్ అయ్యారు.
ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు." నీ ప్రేమ, కరుణ, సపోర్టే నాకు అత్యంత బలాన్ని ఇస్తుంది. ప్రజా సేవపై, వ్యాపార అభివృద్ధిపై, న్యాయ పోరాటం పై నీకు ఉన్న భక్తి నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. ప్రతి రోజూ నేను నిన్ను మరింతగా ఆరాధిస్తాను. రోజూ మీ ప్రేమాభిమానాలతో మా జీవితాలను మరింత ప్రకాశవంతం చేస్తావు. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి."అని ట్వీట్ చేశారు.
అత్తయ్యకు కోడలు బ్రహ్మణి పుట్టినరోజులు శుభాకాంక్షలు చెప్పారు. "నా దిక్సూచి అయిన అత్తగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా కలలను సాకారం చేసుకోవడానికి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించి నా ఎదుగుదలక సహకరించారు. మా కుటుంబానికి మీరే కేంద్రం. మా బలం" అని కోడలు, లోకేష్ భార్య బ్రహ్మణి ట్వీట్ చేశారు.
పురందేశ్వరి కూడా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫొటోను షేర్ చేశారు.