Jagan On Women Welfare: రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఐదు నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఆస్తిని ఇవ్వగలిగామన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పావలా వడ్డీ రుణాలకు సంబంధించిన వడ్డీ రియింబర్స్‌ చేశారు. ఈ మేరకు 46.9 కోట్ల రూపాయలను బటన్ నొక్కి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం విడుదల చేశారు. 


రాష్ట్రవ్యాప్తంగా 12.77 లక్షల మంది మహిళలకు పావలావడ్డీ రుణాలు ఇచ్చామన్నారు జగన్. ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్‌ కింద రూ.46.9 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో సుమారు ఐదు లక్షల మంది మహిళలకు రూ.50 కోట్ల రూపాయలు అందించామన్నారు. 


దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు మహిళల పేరిట ఇచ్చామన్నారు జగన్. ఇప్పటికే 22లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం  జరుగుతోందని తెలిపారు. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామన్నారు. సిమెంటు, స్టీల్‌, మెటల్‌ ఫ్రేంలు సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు రాయితీ కూడా లభస్తోందన్నారు. 


ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉందిన్నారు జగన్. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి మహిళకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తి ఇవ్వగలిగామన్నారు.