నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ బాధ్యతల స్వీకరణ, అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం ఉంటుంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్యచౌదరి పేరును అసెంబ్లీ కార్యదర్శి ప్రకటిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. ముందు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణం చేస్తారు. తర్వాత మంత్రుల ప్రమాణం ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని వైసీపీ అధ్యక్షుడు జగన్ సాధారణ ఎమ్మెల్యేలతోనే ప్రమాణం చేస్తారు. సాయంత్రాని కొత్త స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుంది.
AP Assembly Session Updates: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు- మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
Sheershika
Updated at:
21 Jun 2024 07:47 AM (IST)
Andhra Pradesh Assembly Session Updates:
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు- మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం