అమరావతి: రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలను కేటాయించారు. అందులో రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఎక్యూసిసి) ఏర్పాటు చేయనున్నారు. ఇది జాతీయ సాంకేతిక భవిష్యత్ కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాయపూడి పరిధిలోని సీఆర్ఎ ప్రధాన కార్యాలయానికి ఉత్తరభాగంలో సీడ్ యాక్సెస్రోడ్డు అవతల దీనిని నిర్మించనున్నారు. క్వాంటం బిల్డింగ్ నిర్మాణం కోసం ఆసక్తి ఉన్న వారిని  టెండర్ల కోసం పిలిచారు. ఈ నెల ఆరోతేదీతో టెండర్ల గడువు ముగియనుంది. ప్రాజెక్టు వ్యాల్యూను స్పష్టంగా పేర్కొనకపోయినా నిర్దేశిత ధరకంటే ఎవరు తక్కువకు టెండర్ వేస్తే వారికి కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించారు.

Continues below advertisement

ప్రస్తుతం విట్ (VIT ) యూనివర్శిటీలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ లో రాయపూడి వద్ద నిర్మించే శాశ్వత భవనంలోకి దీన్ని మార్చనున్నారు. అనంతరం అమరావతిని పూర్తిస్థాయి క్వాంటం సిటీగా మార్చాలనేది ప్రభుత్వ ఆలోచన. భవన నిర్మాణానికి అయ్యే ఖర్చును సీఆర్ డిఎ ఐటీ అండ్ ఈ శాఖ సంయుక్తంగా ఖర్చు చేయనున్నట్లు టెండర్లలో పేర్కొన్నారు. ప్రస్తుత భవనాన్ని G ప్లస్1 అంతస్తుగా 4,201 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్, ఫైర్(ఎంఈపిఎఫ్)తో గ్రీన్ బిల్డింగ్ నిబంధనల ప్రకారం నిర్మించనున్నారు. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్ 1,990 చదరపు మీటర్లు, మొదటి ఫ్లోర్ 1,996 చదరపు మీటర్లు, బేస్ మెంట్ 210 చదరపు మీటర్లతో నిర్మించున్నారు. ఇవి కాకుండా హెడ్ రూము 109, డెక్ ఏరియా 130 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Continues below advertisement

భవిష్యత్తులో జాతీయస్థాయి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్గా మార్చాలనేనది ప్రతిపాదనగా ఉంది. దీనికోసం ఇటీవల క్వాంటం వర్కుషాపు కూడా నిర్వహించారు. టిసిఎస్, ఐబిఎంతోపాటు దేశంలో పలు ఐటి కంపెనీల ప్రతినిధులనూ దీనికి ఆహ్వానించారు. ఇందులో భాగంగా బబిఎం 150 క్యూబిట్ కెపాసిటీతో కంప్యూటర్ ఏర్పాటు వేసేందుకు ముందుకు వచ్చింది. టిసీఎస్ అవసరమైన సాంకేతిక నైపుణాన్ని ఇవ్వనుంది. ఎల్ అండ్ టీ నిర్మాణపరమైన అంశాల్లో భాగస్వామ్యం కానుంది. ఇలా మూడు కంపెనీలతో ఇటీవల ప్రభుత్వం ఒప్పందం. చేసుకోవడంతోపాటు క్వాంటం పాలసీని విడుదల చేసింది. వీటిలో భాగంగా క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచింది కూటమి ప్రభుత్వం.

50 వేలమందికి శిక్షణ 

ఏపీలో క్వాంటం కంప్యూటింగ్ ఫై అవగాహన పెంచేందుకు 50,000 మందికి శిక్షణ ఇవ్వబోతోంది ప్రభుత్వం. అమెరికా లోని వైజర్, హైదరాబాద్ లోని క్యూబైటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ కలిసి ఈ శిక్షణ ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 8 నుండి ఈ ట్రైనింగ్ ప్రారంభం కానుంది.

3 భాగాలుగా ట్రైనింగ్ ఉంటుంది

ఈ ట్రైనింగ్ మూడు పార్టు లుగా ఉంటుంది. ఫేజ్ 1 ట్రైనింగ్ 4 వారాలు ఉంటుంది. ఏపీ విద్యార్థులకు ఫీజ్ 500. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ కోర్సులు చదువుతున్న వారు, ఆల్రెడీ చదువు పూర్తి చేసుకున్న వారు, ఆయా సబ్జెక్టు ల్లో ప్రొఫెసర్ లుగా పనిచేస్తున్న వారు ఈ కోర్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది బేసిక్ కోర్స్. https://learn.qubitech.io/  ఇది రిజిస్టర్ చేసుకోవాల్సిన వెబ్ సైట్. వేరే రాస్ట్రాలకు చెందిన విద్యార్థులయితే 1000 రూపాయలు, ఆల్రెడీ టీచర్స్ గా జాబ్ చేస్తున్న వారు 2000 రూపాయలు ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది.

2nd ఫేజ్ ట్రైనింగ్ ఉచితం

 ఫేజ్ 1 లో మంచి మార్కులు తెచ్చుకున్న 3000 మందిని ఎంపిక చేసి వారికి రెండో ఫేజ్ లో శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్ మొత్తం ఆన్ లైన్ లోనే ఉంటుంది.