ఏపీసీఆర్డీఏ నాలుగు టౌన్‌షిప్‌ల‌లో వాణిజ్య, నివాస ప్లాట్లను అమ్మేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇ -వేలం వేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలలో కొనుగోలుదారుల‌కు ఆశాజ‌న‌క‌మైన ధ‌ర‌ల్లో ప్లాట్లు ఉంటాయ‌ని క‌మిష‌న‌ర్  వివేక్ యాద‌వ్‌, వెల్ల‌డించారు. ఈ రెండు జిల్లాల ప‌రిధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ‌కు చెందిన నాలుగు టౌన్‌షిప్‌ల‌లో 100 ప్లాట్ల‌ను అమ్మబోతున్నట్టు తెలిపారు. ఇ-వేలం ద్వారా అమ్మ‌కాలు జ‌రుపుతున్నామ‌ని సంస్థ క‌మిష‌న‌ర్ వివేక్ యాద‌వ్ పేర్కొన్నారు. ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆశాజ‌న‌క‌మైన ధ‌ర‌ల్లోనే ప్లాట్ల‌ను అందుబాటులోనికి తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు.


సీఆర్డీఏ నిర్మించిన ఇన్నర్‌ రింగ్ రోడ్డుకు అతిస‌మీపంలో విజ‌య‌వాడ పాయ‌కాపురం టౌన్షిప్‌, విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ తొమ్మ‌దో నెంబ‌రు జాతీయ ర‌హ‌దారికి చేరువలోని ఇబ్ర‌హీంప‌ట్నం ట్ర‌క్కు టెర్మిన‌ల్ టౌన్షిప్‌, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అమరావతి టౌన్ షిప్, తెనాలి న‌గ‌రం న‌డిఒడ్డున గ‌ల చెంచుపేట‌ టౌన్షిప్లు వాణిజ్య‌ప‌రంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల‌లో ప్లాట్ల‌ను సీఆర్డీఏ అందుబాటులోనికి తీసుకువ‌చ్చింద‌ని వాటి వివ‌రాల‌ను కమిష‌న‌ర్ వివ‌రించారు.


పాయ‌కాపురం టౌన్‌షిప్‌ విజ‌య‌వాడ:


విజ‌య‌వాడ పాయ‌కాపురం టౌన్‌షిప్ న‌గ‌ర పాల‌క సంస్థ‌లో అంత‌ర్భాగ‌మై ఉంది. ఈ టౌన్షిప్‌కు ముందు వైపు ఏపీసీఆర్డీఏ నిర్మించిన ఇన్నర్‌ రింగ్ రోడ్డు , వెనుక వైపున‌ గుంటూరు జిల్లా కాజ నుంచి పాయ‌కాపురం మీదుగా కృష్ణాజిల్లా పెద్ద అవుట‌ప‌ల్లి వ‌ర‌కు వ‌ర‌కు నిర్మాణ ద‌శ‌లో ఉన్న విజ‌య‌వాడ బైపాస్‌ మార్గం ఉంది. మ‌రోవైపు విజ‌య‌వాడ‌-నూజివీడు ప్ర‌ధాన ర‌హ‌దారి, నున్న బైపాస్ మార్గాలతో చ‌క్క‌టి క‌నెక్టివిటి క‌లిగి ఉంది. అంతేకాకుండా నివాస‌యోగ్యాల మ‌ధ్య‌న ఉన్న ఈ టౌన్షిప్‌లో స్థానిక వాణిజ్య ప్లాట్లు- 5 ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక్కో చదరపు గజము రూ.27,500 గాను, త‌క్కిన‌ సినిమా థియేట‌ర్ ప్లాటు- 1, ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను నెల‌కొల్పుకునే ప్లాట్లు- 2, ఆరోగ్య కేంద్రం - 1, డిస్పెన్స‌రి - 1 సౌక‌ర్యాలు గ‌ల ప్లాట్లు, మ‌రో 29 గృహ నివాస‌ ప్లాట్లు క‌లిపి ధ‌ర ఒక్కో చ‌ద‌ర‌పు గ‌జం రూ. 25,000లుగా నిర్ణ‌యించిన‌ట్లు క‌మిష‌న‌ర్ వివేక్ యాద‌వ్ వెల్ల‌డించారు.


హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారికి చేరువ‌లో ఇబ్ర‌హీంప‌ట్నం ట్ర‌క్ టెర్మిన‌ల్ ప్లాట్లు:


విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ తొమ్మ‌దో నెంబ‌రు జాతీయ ర‌హ‌దారికి అతి చేరువ‌లో ఇబ్ర‌హీంప‌ట్నం ట్ర‌క్ టెర్మిన‌ల్ ఏర్పాటైంది. ఇది నివాస‌ గృహాల‌కు స‌మీపంలో ఉంది. ఇందులో నిర్మాణం పూర్తిచేసుకుని సౌక‌ర్యాలు క‌లిగిన‌ వాణిజ్య దుకాణాలు - 3 ప్లాట్లు ప్రభుత్వం ధర ఒక్కో చదరపు గజము రూ. 11,000గా నిర్ణ‌యించ‌గా కార్యాల‌యాలు - 21, ఖాళీ ప్లాట్లు - 4 అందుబాటులో ఉండ‌గా ఈ ప్లాట్ల‌కు చ‌ద‌ర‌పు గ‌జం ధ‌ర - రూ.10,000లుగా  నిర్ణ‌యించారు.


తెనాలి న‌డి ఒడ్డున చెంచుపేట టౌన్‌షిప్:


తెనాలి ప‌ట్ట‌ణంలో ఉన్న చెంచుపేట సీఆర్డీఏ టౌన్షిప్ న‌గ‌రానికి న‌డి ఒడ్డున ఉంది. ఇక్క‌డికి 200 మీట‌ర్ల దూరంలోనే బ‌స్టాండు, రైల్వేస్టేష‌ను, కార్యాల‌యాలు, సినిమా థియేట‌ర్లు, వాణిజ్య స‌ముదాయాలు, పాఠ‌శాల‌లకు దగ్గర ఉంది. ఇందులో వాణిజ్య స‌ముదాయాల ప్లాట్లు – 12 ఉండ‌గా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక్కో చదరపు గ‌జము రూ.35,200. ఆరోగ్య కేంద్రం - 1, ప్రాథ‌మిక పాఠ‌శాల - 1, సినిమా థియేట‌ర్ - 1 లాంటి సౌక‌ర్యాలు నెల‌కొల్పుకునే ప్లాట్ల‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక్కో చదరపు గ‌జము రూ.32,000లు.


అమ‌రావ‌తి టౌన్షిప్‌లో 18 వాణిజ్య ప్లాట్లు:


తాడేపల్లి - మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అమరావతి టౌన్ షిప్‌లో మొత్తం 18 వాణిజ్య ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 16(5) నెంబరు జాతీయ రహదారికి అత్యంత సమీపములో అమరావతి టౌన్ షిప్‌ ఉంది. అమరావతి టౌన్ షిప్‌నకు ఉత్తరం వైపున త్వరలో అమృత విశ్వ విద్యాలయము రానుంది. దక్షిణాన విజయవాడ-గుంటూరు పాత రహదారి, మంగళగిరి రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో అమరావతి టౌన్ షిప్  ఉంది. ఇందులో స్థానిక వాణిజ్య ప్లాట్లు 14కు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక్కో చదరపు గ‌జము 17,600 ఉంది. హాస్పిట‌ల్, ఆరోగ్య కేంద్రం - 1, సినిమా థియేట‌ర్ -1, ప్రాథ‌మిక పాఠ‌శాల - 1, ఉన్న‌త పాఠ‌శాల - 1 గ‌ల ప్లాట్ల‌కు ధర ఒక్కో చదరపు గ‌జము రూ.16,000లు నిర్ణయించారు. 


ఈ నాలుగు టౌన్షిప్‌ల‌లోని వాణిజ్య ప్లాట్ల‌కు ఈ నెల 28వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌ మధ్య ఇ- వేలం నిర్వ‌హిస్తారు. ఈ ప్లాట్లను పొందాలనుకునే వారు ప‌త్రాల‌ను పొందే వీలుగా ఇవాళ్టి నుంచి అంటే 12వ తేదీ ఉద‌యం 11 గంట‌ల నుంచి ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.in/ ఏపీ సీఆర్డీఏ https://crda.ap.gov.in/లో వివరాలు అందుబాటులో ఉన్నాయి. ద‌ర‌ఖాస్తులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు https://konugolu.ap.gov.in నుంచి పొంద‌వచ్చు.


కాల్ సెంటర్: సాంకేతిక సందేహాలకు, పాలనాపరమైన సందేహాలకు: 0866-2527124 ఫోన్ నెంబ‌రుకు సంప్ర‌దించ‌గ‌ల‌రు.


టౌన్ షిప్‌ల‌లో సిబ్బంది ఏర్పాటు:


ఏపీసీఆర్డీఏ టౌన్షిప్‌లలో నివాస, వాణిజ్య ప్లాట్ల‌ను కొనుగోలు చేసేందుకు వ‌చ్చే వారికి సౌల‌భ్యంగా పాయ‌కాపురం, ఇబ్ర‌హీంప‌ట్నం ట్ర‌క్ టెర్మిన‌ల్‌, తెనాలి చెంచుపేట‌, న‌వులూరులోని అమ‌రావ‌తి టౌన్ షిప్ల‌లో సిబ్బందిని నియిమించారు. మంగ‌ళ‌వారం నుంచి ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్లాట్ల‌ను కొన‌ద‌ల‌చిన వారికి ప్లాట్ల‌ను చూపిస్తారు. టౌన్ షిప్‌లో ఏపీసీఆర్డీఏ క‌ల్పిస్తున్న మౌలిక స‌దుపాయాలపై కొనుగోలుదారుల‌కు వివ‌రిస్తారు. వ‌చ్చే వారి సందేహాలు నివృతి చేస్తారు. లే అవుట్ ప్ర‌యోజ‌నాలు భ‌విష్య‌త్తులో క‌లిగే లాభాల‌ను వివ‌రిస్తారు. 


సిబ్బంద వివ‌రాలు
1 కె.ఎస్‌.వి.ర‌మ‌ణ (పాయ‌కాపురం టౌన్షిప్) 70955 99075
2 జి.ఎన్‌.ఎస్‌.భూష‌న్ (ట్ర‌క్ టెర్మిన‌ల్‌, ఇబ్ర‌హీంప‌ట్నం) 70955 99039


3 వి.సాయి ప్ర‌సాద్ (అమ‌రావ‌తి టౌన్షిప్ న‌వులూరు) 70955 99079


4 అంబేద్క‌ర్ (చెంచుపేట, తెనాలి) 80083 13815