Rayudu Official  :  క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్‌ను కలిశారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను   చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, క్రికెటర్‌ అంబటి రాయుడు కలిశారు. ఐపీఎల్ ట్రోఫని గెలిచిన  సీఎస్‌కే టీంను అభినందించిన ముఖ్యమంత్రి అభినందించారు. ఇటీవల ఐపీఎల్‌ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్, ట్రోఫీని ముఖ్యమంత్రికి చూపించారు  సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు.      

                     
  
సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి రూపా గురునాథ్, అంబటి రాయుడు  బహూకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో కాసేపు ముచ్చటించారు.                   


 





 


అంబటి రాయుడుతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.  ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి  అంబటి రాయుడు వివరించారు.  వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.                                            


చెన్నై సూపర్ కింగ్స్ టీం  యజమాని శ్రీనివాసన్, ఆయన చెన్నై సిమెంట్స్ అధినేత. సీఎం జగన్ తో ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ చొరవతోనే ట్రోఫీని తాడేపల్లికి తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. మరోవైపు అంబటి రాయుడు గతంలో ఐపీఎల్ ఆడుతున్న సమయంలో కూడా ఓ సారి హఠాత్తుగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ ను కలిశారు. అప్పట్లోనే ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది.                                                                      


ఐపీఎల్ ముగిసిన తర్వాత అంబటి రాయుడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజా భేటీలో రాజకీయాల చర్చ జరిగిందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.