Andhra News : ఎన్టీఆర్ కుమారులకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు సీయం పదవి ఇస్తాడా అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ ను నమ్మితే చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్దపడటమే అని జనసైనికులను, వీర మహిళలను హెచ్చరించారు మంత్రి ఆంబటి. నకరికల్లు మండలం గుండ్లపల్లి లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అంబటి రాంబాబు , ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పని అయి పోయిందని.. సైకిల్ తొక్కే ಓపిక లేక సైకిల్ తొక్కేందుకే పవన్ ను పిలిచాడని అన్నారు.. సినీ యాక్టర్ గా నటించి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే సబబే కాని పవన్ సైకిల్ తొక్కేందుకు కూడా ప్యాకేజీ అడుగుతున్నారని అంబటి చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ను కాపులు మితిమీరి అతిగా అభిమానిస్తున్నారన్నారు .మితి మీరిన అభిమానం కాపు సమాజానికి కీడు చేస్తోదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం పెట్టాడానికి సామాజిక వర్గం సిద్దంగా ఉంటే ఆ సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు అమ్మడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కలలు కంటున్నారని తెలిపారు.. వచ్చే ఎన్నికల తర్వాత పవన్ సీయం అవుతాడని పిచ్చి అభిమానంతో, అర్థం లేని లాజిక్ లతో పవన్ కోసం కమ్యూనిటీ అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు..కానీ పవన్ మైడ్ సెట్ మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉందనీ తేల్చారు.
టీడీపీ పార్టీని ఎన్ఠీఆర్ నుంచి లాక్కుంటున్న సమయంలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు దగ్గరకు తీశారని అవసరం తీరాన తర్వాత నందమూరి కుటంబాన్ని దూరపెట్టారన్నారు అంబటి వరాంబాబు. చంద్రబాబు ఊసరవెల్లి అని అవసరం తీరిన తర్వాత తొక్కేయడం ఆయన నైజమని తెలిపారు..పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కల్లా అని స్పష్టంచేశారు.. తనను పూర్తిగా నమ్మి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజిక వర్గం చేత బాబును కూర్చునే పల్లకిని మోయిస్తాడు పవన్ అని అన్నారు అంబటి..పవన్ కళ్యాణ్ ను నమ్మి ఆయన వెన్నంటి ఉన్న జనసేన కార్యకర్తలు వీర మహిళలు పూర్తిగా నష్టపోతారని జోస్యం చెప్పారు.
పవన్ సీయం చేయాలని వీరు భావిస్తుటే పవన్ వీరిని చంద్రబాబునాయుడు కు కట్టు బానిసలను చేస్తాడని తెలిపారు..చంద్రబాబు ఎవరినైనా అవసరం ఉన్నంత కాలమే ఉపేక్షిస్తురని ...ఆ తర్వాత కాలగర్భంలో కల్పిస్తాడని అన్నారు.. చంద్రబాబును నమ్మి జనసేనాని వెళితే ముఖ్యమంత్రి పదవి కాదు కదా... ఎమ్మెల్యే గా కూడా గెలవకుండా కుతంత్రాలతో అడ్డుకొంటారని తొలిపారు.. ఎన్టీఆర్ కొడుక్కే మంత్రి పదవి ఇవ్వని వాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఒక సంవత్సరం ముఖ్యమంత్రి ఎలా ఇస్తాడన్నారు. అందుకే కాపులు పవన్ ను నమ్మెద్దని అంబటి చివరికి సలహా ఇచ్చారు.