Chandrababu Letter : సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ వేధింపులకు గురిచేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. టీడీపీ కార్యకర్తలు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను సీఐడీ అధికారులు అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా చొరబడి నోటీసుల పేరుతో వేధించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమన్నారు.
సీసీ కెమెరాలు తీసేసి
అలాగే విచారణ చేస్తున్న సమయంలో గదిలో సీసీ కెమెరాలు లేకుండా చేసి దాడి చేశారని చంద్రబాబు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. ప్రతిపక్షాల కార్యకర్తలు, నేతలను వేధించేందుకు ప్రభుత్వం సీఐడీని ఉపయోగిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బెదిరింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను కుట్రపూరితంగా వేధిస్తున్న సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా నిలబడాలని డీజీపీని చంద్రబాబు లేఖలో కోరారు.
తప్పుడు కేసులు
ఏపీలో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారుల వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. సోషల్ మీడియా పేరు చెప్పి తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్షాల కార్యకర్తలు, నేతలను హింసిస్తున్నారని ఆరోపించారు. కొంత మంది పోలీసు అధికారులు పరిధి దాడి వ్యక్తులను టార్చర్ చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంతటి దారుణాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్, సాంబశివరావు విషయంలో సీఐడీ అధికారుల తీరు అమానుషమన్నారు. అలాంటి అధికారులను వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడితే ఎవరినీ సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Seediri Appalaraju: ఏపీ మంత్రి అప్పలరాజు రూటే సపరేటు - మీరు మారిపోయారు సార్ అంటున్న మద్దతుదారులు
Also Read : Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !